తెలంగాణవాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభవార్త అందించింది. తెలంగాణలో ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేనివారికి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి లైన్ క్లియన్ చేశారు. తెలంగాణలోని పేద, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం వైట్ రేషన్ కార్డుల ద్వారా బియ్యం, నిత్యావసరాలను పంపిణీ చేస్తుంది.
అయితే తెలంగాణలో వాటికి అర్హులైనవాళ్లు చాలా మంది ఉండగా.. కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి ఎంతో కాలంగా ఆశగా వేచి చూస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేని వారందరికీ తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పిందనుకోవాలి.
గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ ప్రాసెస్ ను వేగవంతం చేయాలంటూ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో ఎక్కువగా 6 గ్యారెంటీల కంటే కూడా రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన సంగతి తెలిసిందే.
ఎందుకంటే 6 గ్యారెంటీలకు రేషన్ కార్డులనే అధికారులు ప్రామాణికంగా తీసుకోవడంతో.. తాజాగా రైతు రుణమాఫీకి కూడా ఆధారంగా రేషన్ కార్డునే తీసుకోవడంతో రేషన్ కార్డుల కోసం చాలామంది కాళ్లు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
రోజురోజుకు ఫిర్యాదులు ఎక్కువ కావడంతో..రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యచరణ ప్రణాళిక రూపొందించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.రేవంత్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.