దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో ఈ రోజు జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 81.44 % పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇవ్వడంతో పూర్తి పోలింగ్ శాతం ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు కరోనా బాధితులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దుబ్బాకలో 85 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఉపఎన్నికల్లో సైతం అదే స్థాయిలో పోలింగ్ శాతం నమోదవడంతో, నివేదికల ఆధారంగా ప్రధాన పార్టీల నాయకులు విజయావకాశాలపై విశ్లేషణ చేస్తున్నారు. ఇటీవల కాలంలో అత్యంత ఆసక్తి, ఉత్కంఠ రేపిన ఈ ఉపఎన్నిక ఫలితం నవంబర్ 10 న వెలువడనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ