ఓటర్ల తుది జాబితా ప్రచురించాకా ఎప్పుడైనా జీహెఛ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ

GHMC Elections, GHMC Elections News, GHMC Notification, GHMC Notification will be Released Anytime after Final Voter List, Greater Hyderabad Municipal Corporation, Greater Hyderabad Municipal Corporation Act, SEC Parthasarathi, SEC Parthasarathi Says GHMC Notification, State Election Commission GHMC poll

ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి పాత్ర అత్యంత ప్రాధాన్యమైనదని, రిటర్నింగ్ అధికారిగా నియమించబడిన వారు పారదర్శకంగా, తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాలని, అలాగే ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి అన్నారు. మంగళవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని సమావేశ మందిరంలో టిఓటి (ఆర్ఓలు, ఎఆర్ఓలకు శిక్షణ ఇచ్చే ట్రైనర్లు) లకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1992వ సంవత్సరంలో 73 మరియు74వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలకు స్వయం పరిపాలనా అధికారాలను వర్తింప చేసిందని, స్థానికులకు అధికారాలు ధారాదత్తం చేసి తమ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కొరకు అవకాశం కల్పించిందన్నారు. అలాగే ఆర్టికల్ 243 ZA క్రింద రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పడిందని, మోడల్ కోడ్ రూపకల్పన, గుర్తుల కేటాయింపు వంటి ప్లీనరీ అధికారాలు కలిగిన స్వతంత్య సంస్థగా ఏర్పడిందని అన్నారు. గ్రామ పంచాయితీ నుండి జిల్లా పరిషత్ వరకు, మున్సిపల్ కౌన్సిళ్లు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు.

ఓటర్ల తుది జాబితా ప్రచురించాకా ఎప్పుడైనా జీహెఛ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ:

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహక ప్రక్రియ మొదలైందని, ఎలెక్టోరల్ రోల్స్ ప్రచురణకు సంబంధించిన నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని, ఈ నెల 7వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా జారీ చేయడం జరుగుతుందన్నారు. 8 వ తేదీ నుండి 11వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి, పరిష్కరించి 13వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందని, తుది జాబితా ప్రచురించిన తరువాత ఎప్పుడైనా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవచ్చన్నారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బాధ్యత రిటర్నింగ్ అధికారిదే:

రిటర్నింగ్ అధికారులు ఎన్నికలకు సంబంధించిన రూల్స్, నియమ నిబంధనలు, ఎన్నికల సంఘం సమయానుగుణంగా జారీ చేసే సూచనలను ఆకళింపు చేసుకొని అవసరాన్ని బట్టి ఉపయోగించేలా పూర్తి అవగాహనతో ఉండాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బాధ్యత రిటర్నింగ్ అధికారిదేనని, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ సిబ్బంది నియామకం, వారికి పోలింగ్ కు సంబంధించిన సామాగ్రి సమకూర్చడం వంటి ప్రతి పనీ పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణ నుండి ఫలితాల ప్రకటన వరకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్వర్తించాల్సిన బాధ్యతలకు సంబంధించి చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలని, మోడల్ కోడ్ ప్రతులు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు అందించి వాటిని అమలు చేసేలా చూడాలని, ఎన్నికల ఖర్చుకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించాలని, అభ్యర్థుల అఫిడవిట్లు, నేర చరిత్ర పరిశీలించాలని, అనర్హతకు సంబంధించిన రూల్స్ పై పట్టు ఉండాలన్నారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారుల బాధ్యత రిటర్నింగ్ అధికారులదే అన్నారు.

జీహెఛ్ఎంసీలో 150 వార్డులకు 150 మంది రిటర్నింగ్ అధికారులు:

జీహెచ్ఎంసీ లో 150 వార్డులు, 30 సర్కిల్లు ఉన్నాయని, ఒక్కో సర్కిల్ కు ఒక డిప్యూటీ కమిషనర్ ఉన్నారని, వీరికి ఎన్నికలకు సంబంధించిన విధులు కేటాయించడం జరిగిందని, ఎన్నికలకు సంబంధించి 150 వార్డులకు 150 మంది రిటర్నింగ్ అధికారులు, 150 కౌంటింగ్ సెంటర్లు ఉంటాయని, సగటున ఒక్కో వార్డుకు 50 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. పోలింగ్ స్టేషన్లలో వీడియో, వెబ్ క్యాస్టింగ్ కు ఏర్పాట్లు చేయాలని, ప్రతి వార్డులో విశాలంగా, మంచి లైటింగ్ ఉండి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఒక పోలింగ్ స్టేషన్ ను ఎంపిక చేసి ఫేస్ రెకగ్నిషన్ టెక్నాలజీకి ఏర్పాట్లు చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రతి ఓటరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజర్లు ఉపయోగించేలా చూడాలని అన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 11 =