తెలంగాణ బడ్టెట్ ప్రవేశ పెట్టిన భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Budget Will Be Introduced In Telangana Assembly Today, Budget Will Be Introduced In Telangana Assembly Today,Telangana Assembly Today,Bhatti Vikramarka Budget Will Be Introduced, Assembly Sessions, Deputy CM Bhatti Vikramarka, Extension of Assembly Sessions, Telangana Budget, Telangana Budget Session 2024, Telangana Budget,Assembly Elections, Lok Sabha Elections, Live Updates, Politics, Political News, Mango News, Mango News Telugu
Finance Minister Bhatti Vikramarka, Telangana Budget, Telangana Assembly, cm revanth reddy

ఎన్నో ఆశలు.. భారీ అంచనాల మధ్య తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టరు. రూ. 2,91,159 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టగా.. అందులో మూలధన వ్యయం రూ. 33,487 కోట్లు అని భట్టి విక్రమార్క వెల్లడించారు. పన్ను ఆదాయం రూ. 1,38,181.26 కోట్లు.. పన్నేతర ఆదాయం రూ. 35,208.44 కోట్లు అని పేర్కొన్నారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 57,112 కోట్లు అప్పు తీసుకోనున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇక అంతకంటే ముందు తెలంగాణ బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

తెలంగాణ బడ్జెట్ పద్దులివే..

ఆర్థిక లోటు అంచనా రూ.49,255.41 కోట్లు

ప్రాథమిక లోటు అంచనా రూ.31,525.63 కోట్లు

రెవెన్యూ మిగులు అంచనా రూ.297.42 కోట్లు

వ్యవసాయానికి రూ.72,659 కోట్లు

పశుసంవర్ధశాఖకు రూ.1,980కోట్లు

ఉద్యానశాఖకు రూ.737కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 2,736 కోట్లు

ఎస్సీ సంక్షేమం రూ.33,124కోట్లు

ఎస్టీ సంక్షేమం రూ.17,056కోట్లు

మైనార్టీ సంక్షేమం రూ.3,003కోట్లు

బీసీ సంక్షేమం రూ.9,200 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ. 2,762 కోట్లు

ఐటీ శాఖకు రూ.774 కోట్లు

నీటిపారుదల రంగానికి రూ.22,301 కోట్లు

విద్యకు రూ.21,292 కోట్లు

హోంశాఖకు రూ.9,564కోట్లు

రోడ్లు, భవనాల శాఖకు రూ.5,790 కోట్లు

ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836కోట్లు

రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 723కోట్లు

గృహజ్యోతికి రూ.2,418కోట్లు

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు రూ.1,525 కోట్లు

వైద్య, ఆరోగ్యం రూ. 11,468 కోట్లు

ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు

అడవులు, పర్యావరణం రూ.1,064 కోట్లు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY