ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఏడాది మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. దాదాపు నాలుగు నెలలుగా కవిత ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం కవిత ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమెకు మాత్రం ఊరట దక్కడం లేదు. కవితను బయటకు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా కవితకు ఊరట దక్కలేదు. మరికొన్ని రోజుల పాటు కవిత జైల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలో తన బిడ్డ కవితను తలుచుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. కన్న కూతురు జైల్లో ఉంటే బాధ ఉండదా? అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వారితో సమావేశమై.. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలో వారికి దిశానిర్దేశం చేశారు. అధికార పక్ష నేతలను సభలో ఎలా ఎదుర్కోవాలో సూచించారు. ఇదే సమయంలో తన కూతురు కవితను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కన్న బిడ్డ జైల్లో ఉంటే ఎవరికి మాత్రం బాధగా ఉండదని.. కొందరు మనసు లేని వ్యక్తులు కవిత జైల్లో ఉన్నా స్పందించడం లేదని అంటున్నారని కేసీఆర్ వెల్లడించారు. తాను అగ్నిపర్వతంలా ఉన్నానని.. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని అన్నారు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణ సాధించామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
గతంలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే కదా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షలో ఉండడం తనకు కొత్త కాదని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పటికంటే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బాగోలేదని.. ఆ పార్టీ నాయకులే ఈ విషయాన్ని చెబుతున్నారని కేసీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పాలన గురించి అనేక మంది తనకు ఫోన్లు చేసి చెబుతున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలనపై శ్రద్ధ లేదని ఆరోపించారు. ఆయన ఎంతసేపూ గుంజుకునే పనిలోనే ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎందుకు గాడితప్పుతున్నాయని నిలదీశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE