తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బుధవారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. సబితా ఇంద్రా రెడ్డికి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారడంతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు సహా మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ మార్షల్స్ బలవంతంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చారు. వారందరినీ పోలీస్ బస్సులో ఎక్కించి బీఆర్ఎస్ భవన్ వైపు తీసుకెళ్లారు. అరెస్ట్ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడడం తగదన్నారు.
ఇకపోతే బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనను మోసం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తే మద్ధతు ఇస్తానని చెప్పి.. ఆమె బీఆర్ఎస్‌లోకి వెళ్లారని అన్నారు. అయితే రేవంత్ రెడ్డి మోసం చేశారని అనడంతో సబితా ఇంద్రా రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. దీంతో అలజడి రేగింది. బీఆర్ఎస్ మహిళా సభ్యులను, తెలంగాణ ఆడపడుచులను రేవంత్ రెడ్డి అవమానించారని.. వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ