ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ మూడు వారాలకు వాయిదా

Delhi Liquor Scam Case Supreme Court Adjourned The Hearing of MLC Kavithas Plea To 3 Weeks,Delhi Liquor Scam Case,Supreme Court Adjourned The Hearing,MLC Kavithas Plea To 3 Weeks Adjourned The Hearing,Mango News,Mango News Telugu,Delhi Liquor Scam Case Latest News,Supreme Court adjourns Kavitha's appeal,Kavitha Submits Phones to ED,Delhi Liquor Policy Case,Kavitha appears before ED,ED Interrogation In Delhi Liquor Scam,MLC K Kavitha ED Interrogation,BRS MLC Kavitha For ED Enquiry Again,MLC Kavitha ED Enquiry Today,Delhi Liquor Scam Case Latest Updates,BRS MLC Kavitha Live News

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. మ‌హిళ‌ల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయానికి పిలిచి విచారించే అంశంపై ఎమ్మెల్సీ క‌విత దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచార‌ణ చేపట్టింది. జ‌స్టిస్ అజ‌య్ ర‌స్తోగి, జ‌స్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ద్విసభ్య ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మ‌హిళ‌ల‌ను ఈడీ ఆఫీసుకు పిలిచి విచార‌ణ చేసే విష‌యమై గ‌తంలో న‌ళిని చిదంబ‌రం వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కవిత పిటిషన్‌కు ట్యాగ్‌ చేసింది. ఇక ఎమ్మెల్సీ క‌విత త‌ర‌ఫున ప్రముఖ సీనియ‌ర్ న్యాయ‌వాదులు క‌పిల్ సిబ‌ల్ మరియు విక్రమ్ చౌధురిలు వాదనలు వినిపించారు. అలాగే ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.

కాగా కవిత విచారణ సందర్భంగా తన పిటిషన్‌లో సరికొత్త అభ్యర్థన చేశారు. మద్యం పాలసీ కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని కోరారు. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ తనకు పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 50 ప్రకారం జారీచేసిన నోటీసులు, సీఆర్‌పీసీ సెక్షన్‌ 160కి విరుద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్సీ క‌విత కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే వాంగ్మూలం నమోదు చేసేప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కూడా కవిత ఆ పిటిషన్‌లో కోరారు. ఇక తన ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, జారీ చేసిన జప్తు నోటీసులను రద్దు చేయాలని, ఫోన్‌ను సీజ్‌ చేయడం చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్ధించారు. విచారణ సందర్భంగా.. ఈడీ అధికారులు మానసిక, శారీరక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గతంలో కూడా ఇలాంటివి పలు ఉదాహరణలు ఉన్నాయని కవిత విమరించారు. కాగా కవిత ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఈడీ విచారణకు మూడుసార్లు హాజరైన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 2 =