జీహెచ్‌ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరణ

Gadwal Vijayalakshmi, Gadwal Vijayalakshmi Takes Charge as GHMC Mayor, Gadwal Vijayalakshmi Takes Charge as GHMC Mayor Today, Gadwal Vijayalaxmi takes charge as Mayor of Hyderabad, GHMC Mayor, ghmc mayor gadwal vijayalakshmi, Hyderabad, Hyderabad Mayor Gadwal Vijayalakshmi, Mango News, Mayor Vijayalakshmi, Vijayalakshmi

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌ గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఫిబ్రవరి 22, సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, పలువురు పార్టీ నాయకులు, కార్పోరేటర్లు హాజరై మేయ‌ర్‌ విజ‌య‌ల‌క్ష్మికి శుభాకాంక్ష‌లు తెలిపారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా తన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఫిబ్రవరి 11 న జరిగిన జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేట‌ర్ అయిన గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి మేయర్‌ గా, తార్నాక టీఆర్ఎస్ కార్పొరేట‌ర్ అయిన మోతె శ్రీల‌త డిప్యూటీ మేయ‌ర్‌ గా ఎన్నికయిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ