తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇది ఫైనల్

Telangana CM Revanth Reddy This is Final,Telangana CM Revanth Reddy,This is Final,Telangana CM, Revanth Reddy, T congress, Uttam Kumar Reddy,Telangana Congress Chief Revanth Reddy,Congress announces Revanth Reddy,Mango News,Mango News Telugu,Telangana Assembly Election,Congress Government Latest News,Telangana CM Revanth Reddy Latest News,Telangana CM Revanth Reddy Latest Updates,Revanth Reddy Live Updates,Telangana CM Latest News,T Congress Latest News
telangana cm, revanth reddy, t.congress, uttam kumar reddy

నరాలు తెగే ఉత్కంఠకు ఎండ్ కార్డ్ పడింది. తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది తేలిపోయింది. నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ కొత్త సీఎం పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 7న తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అయితే ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించింది. కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలుపొందగా.. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, ఒక స్థానంలో సీపీఐ గెలుపొందాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 60 సీట్లు కావాల్సి ఉండగా.. కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం ఎవరు అనేది మాత్రం ఉత్కంఠకరంగా మారింది.

సోమవారం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్‌లో సీఎల్పీ మీటింగ్ జరిగింది. గెలిచిన ఎమ్మెల్యేలంతా.. సీఎల్పీ నేత ఎంపిక విషయం పూర్తిగా అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి తెలియజేశారు. ఆ తర్వాత ఏఐసీసీ అబ్జర్వర్ డీకే శివకుమార్ కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే అధిష్టానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గుచూపడంతో.. కొందరు సీనియర్ నేతలు అందుకు ఏకీభవించలేదు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకు ఏమాత్రం అంగీకారం తెలపలేదు. అనంతరం వారిద్దరు కూడా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

ఢిల్లీ వెళ్లిన భట్టి, ఉత్తమ్‌లతో అధిష్టానం చర్చలు జరిపింది. ఆ తర్వాత అగ్రనేతలంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఫైనల్ చేశారు. అంతకంటే ముందే రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన మార్గం మధ్యలో ఉండగానే వేణుగోపాలో అధిష్టానం నిర్ణయాన్ని ప్రకటించారు. సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + two =