ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఘట్‌కేసర్ కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ డ్రామా ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఆ బీఫార్మసీ విద్యార్థిని (19) బుధవారం నాడు ఆత్మహత్యకు పాల్పడింది. కిడ్నాప్ డ్రామా ఘటన అనంతరం ఘట్‌కేసర్ లోని తన మేనమామ ఇంట్లో ఉంటున్న ఆ విద్యార్థిని బుధవారం ఉదయం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముందుగా ఫిబ్రవరి 10 న ఈ విద్యార్థిని కిడ్నాప్ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే పూర్తిస్థాయి విచారణ అనంతరం కిడ్నాప్ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని, అలాగే కిడ్నాప్‌కు కూడా ఎవరూ ప్రయత్నించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆ విద్యార్థిని కావాలనే పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించిందని వెల్లడించారు. కుటుంబ సమస్యలు, గొడవలు కారణంగానే ఇంటి నుంచి వెళ్లిపోవడానికే కిడ్నాప్, అత్యాచారం నాటకమాడినట్టు ఆ విద్యార్థిని విచారణలో తెలిపినట్టు పోలీసులు వివరించారు. ఈ క్రమంలో పదిరోజుల అనంతరం ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం ఒక్కసారిగా కలకలం రేపుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ