పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేతలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

#KCR, 2021 Telangana MLC Elections, Graduates MLC Elections, KTR, KTR Meeting with GHMC Leaders, KTR Meeting with GHMC Leaders over MLC Elections, Mango News, MLC Elections, telangana, Telangana Graduates MLC Elections, Telangana MLC Elections, Telangana MLC Elections 2021, Telangana MLC Elections News, Telangana MLC Elections Updates, Telangana Politics, TRS Working President, TRS Working President KTR

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-‌హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 14 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలు, కార్యచరణపై చర్చించేందుకు బుధవారం ఉదయం తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు.

ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అలాగే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో కూడా మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 9 =