మద్యం కోసం వైన్ షాప్‌కు వెళ్తున్నారా?

Going To A Wine Shop To Buy Liquor?,Wine Shop To Buy Liquor,Going To A Wine Shop,Wine Shop,Liquor, Online Delivery,Swiggy,Wine, Wine Shops,Zomato,Live Updates,Politics,Political News, Mango News,Mango News Telugu,
liquor, wine, wine shops, online delivery, swiggy, zomato

ప్రస్తుతం మొత్తం ఆన్లైన్ లోనే నడుస్తుడటంతో. అన్ని డోర్ డెలివరీ అవుతున్నాయి. ఒకప్పుడు ఏది కావాలన్నా..ఏంతినాలన్న..ఏం తెచ్చుకోవాలన్న ఆయా షాప్స్ కు ..రెస్టారెంట్ కు వెళ్లి కావాల్సింది తెచ్చుకోవడం..తినడం చేసేవాళ్లు. కానీ కరోనా మహమ్మారి వచ్చిన తరువాతా అంతా మారిపోయింది. ఏదికావాలన్న ఇంటికే తెచ్చే హోం డెలివరీ సంస్థలకు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రొద్దున్నే టూత్ పేస్ట్ దగ్గరి నుండి పడుకునేటప్పుడు పెట్టుకొనే అల్ అవుట్ వరకు ఇలా ఏది కావాలన్నా క్షణాల్లో తెచ్చే హోం డెలివరీ సంస్థలు ఆన్ లైన్ లో అందుబాటులోకి యాప్ లను తీసుకువచ్చాయి. మనకు ఏది కావాలన్నా చేతిలో స్మార్ట్ ఫోన్ నుండి క్లిక్ అనిపిస్తే చాలు..వెంటనే కాలింగ్ బెల్ కొట్టి డెలివరీ బాయ్ సార్ అంటూ ఇంటికే అన్ని తీసుకువస్తున్నారు. దీంతో చాలామందికి బయటకు వెళ్లి వెతుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అన్ని వచ్చాయి కానీ మందుబాబులకు కూడా ఇలాంటి హోమ్ డెలివరీ అవకాశం కల్పించొచ్చు కదా..చుక్క మందు కోసం వెతుక్కొని ..పోయేపని తప్పుద్ది అంటూ కోరుకుంటున్నారు మందుప్రీయులు. వారి కోరిక త్వరలోనే నెరవేరబోతోంది.

లిక్కర్ కోసం ఇక నుంచి వైన్ షాప్స్ కు వెళ్లాల్సిన పని లేకుండా ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేసుకునే వెసులబాటు అందుబాటులోకి రానుంది. ప్రముఖ హోమ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ద్వారా మద్యం హోం డెలివరీ చేయాలని లిక్కర్ తయారీదారులు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే మందుబాబుల కోరిక అతి త్వరలోనే తీరబోతుంది. పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ, హరియాణా, పంజాబ్, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడులో ముందుగా చేపట్టాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విధానం సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అమలు చేయబోతారని టాక్ నడుస్తోంది. కాగా ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్లో మద్యం హోం డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసి మందు బాబులు ఎక్కడో ఏమో కానీ ముందు తెలంగాణ లో వైన్స్ హోమ్ డెలివరీని అందుబాటులోకి తీసుకరావాలని వారు కోరుకుంటున్నారు.

వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ లోనే మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. అంతెందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుందంటే దానికి కారణం మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం తోనే.. అందుకే మద్యం అమ్మకాల విషయంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అందులో తలదూర్చక పోగా ఇంకాస్త అమ్మకాలను పెంచాలనే చూస్తుంది తప్పితే తగ్గించే పని మాత్రం చేయదు. ఇక ఇప్పుడు హోమ్ డెలివరీ వస్తే ఇంకాస్త అమ్మకాలు పెరగడం ఖాయం. మరి త్వరగా తెలంగాణ లో దీనిని అందుబాటులోకి తీసుకొస్తే మందుబాబులు సంబరాలు చేసుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE