భాగ్యనగర వాసులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు మెట్రో విస్తరణ రూపకల్పన చేయాలని.. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దానికోసం అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో.. సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు కొంతమంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమీక్షలో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలపై పురోగతిని సీఎం రేవంత్ ఆరా తీశారు . దీనికి ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి తాము సంప్రదింపులు జరిపామని.. కేంద్రం నుంచి అనుమతులు రావాల్సిఉందంటూ అధికారులు రేవంత్ కు వివరించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి మొత్తం 76.4 కిలోమీటర్ల విస్తరణకు 24, 269 కోట్ల రూపాయల అంచనాలతో డీపీఆర్‌ను కేంద్రానికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సమానంగా నిధులు భరించేలా జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టును చేపట్టే ప్రతిపాదనలు తయారు చేసింది.
కేంద్రం నుంచి అనుమతులు సాధించడానికి నిర్వీరామంగా ప్రయత్నించాలని, అనుమతులు రాగానే వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్ సూచించారు. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవెలప్మెంట్ యూనివర్సిటీ వరకు మొత్తం 40 కి.మీటర్ల మేర మెట్రో విస్తరించడానికి కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ డెవలప్ చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలని రేవంత్ చెప్పారు. దీనికి అవసరమయ్యే అంచనాలతో డీపీఆర్ తయారు చేసి మరోసారి కేంద్రానికి పంపించాలని సూచించారు. హెచ్ఎండీఏతో పాటు ఎఫ్ఎస్డీఏను ఈ మెట్రో విస్తరణలో భాగస్వామ్యులను చేయాలని సీఎం చెప్పారు.