గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని వెల్లడించిన అధికారులు ..’కీ’పై జూన్ 17 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు చెప్పారు. జూన్ 13 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ లింక్‌ను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. లాగిన్ అయ్యాక కీ పట్ల ఎవరికైనా.. ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడే ఇచ్చిన టెక్స్ట్ బాక్స్‌లో ఇంగ్లీష్‌లో తమ తమ అభ్యంతరాలను తెలపవచ్చని పేర్కొంది.
అలాగే, కీ పట్ల తమ అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను అంటే ఉదాహరణకు.. పేరు/ఎడిషన్/పేజీ నంబర్/పబ్లిషర్స్ పేరు/వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ వంటివి అప్‌లోడ్ చేసుకోవచ్చని కమిషన్ సూచించింది. అంతే తప్ప ఈమెయిల్స్, వ్యక్తిగతంగా కలిసి అభ్యంతరాలను వివరించడం వంటి పనులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అనుమతించబోమని తేల్చి చెప్పింది.
అలాగే, నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత అంటే జూన్ 17 తర్వాత ఎవరి అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గాను..జూన్ 9న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు తెలంగాణా వ్యాప్తంగా 3.02 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మరోవైపు తెలంగాణలో 563 గ్రూప్-1 సర్వీసు పోస్టుల భర్తీ కోసం ప్రధాన పరీక్ష షెడ్యూలును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 12న ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు వరుసగా ఈ పరీక్షలు జరుగుతాయని టీజీపీఎస్సీ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE