తెలంగాణలో నిరుద్యోగులు గళమెత్తుతున్నారు. మొన్న డీఎస్సీ వాయిదా వేయాలని నిరసనకు దిగినా కూడా.. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని తేల్చి చెప్పడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు గ్రూప్ 2లో ఒక్క పోస్టు పెంచే దాఖలాలు కూడా కనిపించడం లేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు లేదని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతవరకు స్పష్టతను కూడా ఇచ్చారు. కేవలం తమ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడానికి నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే నిరుద్యోగులు కోరుతున్నట్లు పరీక్షలు వాయిదా వేసే ఆలోచన చేయడం లేదని సమాచారం. షెడ్యూల్ ప్రకారమే గ్రూపు 2 పరీక్షలను ఆగస్టు 7,8 తేదీల్లోనే నిర్వహించడానికి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే జిల్లాల వారీగా పరీక్షా కేంద్రాలను గతంలో గుర్తించగా.. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాలతో పాటు పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు టీజీపీఎస్సీ వర్గాలు ద్వారా సమాచారం అందుతోంది. అయితే మరోవైపు గ్రూపు 2లో 2వేల పోస్టుల సంఖ్యను పెంచుతామని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఇప్పుడు తుంగలో తొక్కిందని నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE