పదేళ్లు తెలంగాణలో అధికారంలో కొనసాగింది బీఆర్ఎస్ పార్టీ. కానీ గతేడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ చేతిలో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మరింత దెబ్బ తగిలింది. ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. అప్పటి నుంచి బీఆర్ఎస్కు కష్టాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. కొద్దిరోజులుగా చూస్తుంటే క్రమక్రమంగా బీఆర్ఎస్ పట్టు కోల్పోతూ వస్తోంది. అయితే ఒక్క దగ్గర పాత్రం బీఆర్ఎస్ పట్టు అలాగే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే బీఆర్ఎస్ వెంటే ఉన్నారనే మాట వినిపిస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులను కేసీఆర్ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. వారికి అన్ని విధాలుగా అండగా నిలబడ్డారు. వారు అడిగిందల్లా ఎప్పటికప్పుడ సమకూర్చారు. అందుకే ముందు నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి బీఆర్ఎస్కు మంచి మద్ధతు ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటికీ.. ఇప్పటి కూడా ప్రభుత్వ ఉద్యోగులు బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారు. ముఖ్యంగా అత్యంత పవర్ ఫుల్ శాఖ అయిన విద్యుత్ శాఖ ఉద్యోగులు ఇప్పటి కూడా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో ప్రభుత్వ పరమైన లోపాలను ఎప్పటికప్పుడు వారు బీఆర్ఎస్కు చేరవేస్తున్నారనే టాక్ ఉంది. ఆ ఆధారాలతో బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ దుమ్ము దులిపేస్తోంది.
ఒక్క విద్యుత్ శాఖ ఉద్యోగులే కాకుండా మెజార్టీ ప్రభుత్వ ఉద్యోగులు బీఆర్ఎస్ వెంటే ఉన్నారట. అయితే ప్రభుత్వ ఉద్యోగులను తమవైపు తిప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. వారిని దారికి తెచ్చుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఒకవేళ బెదిరించి దారికి తెచ్చుకుందామంటే అది మొదటికే మోసం వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకుంటే ఏమవుతుందో.. ఏపీలో కళ్లారా చూశాము. ఏకంగా వైసీపీ ప్రభుత్వమే గద్దె దిగిపోయింది. అందుకే ఆ తప్పు చేయొద్దని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అలా కాకుండా ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
గతంలో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులు ఏది అడిగితే అది వెంటనే ఇచ్చారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా తమ విధివిదానాలతో ప్రభుత్వ ఉద్యోగులను మెప్పించాలని చూస్తున్నారట. ప్రో ఎంప్లాయిస్ విధానాన్ని అమలు చేయాలని అనుకుంటున్నారట. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై వెంటనే దృష్టి పెట్టి.. వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా అడుగులేస్తున్నారట. అలా చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను తమవైపు రప్పించుకోవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉద్యోగులు టర్న్ అవుతారా? లేదా బీఆర్ఎస్ వెంటనే ఉంటారా? అన్నది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE