టీఎస్ లాసెట్-2023, టీఎస్ పీజీఎల్‌సెట్-2023 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

TS LAWCET 2023 TS PGLCET 2023 Schedule Released Exams to be held on May 25th,TS LAWCET 2023 Schedule Released,TS PGLCET 2023 Schedule Released,TS LAWCET And TS PGLCET Exams May 25th,Mango News,Mango News Telugu,Ts Lawcet Counselling,Pglcet Eligibility,Ts Lawcet 2023,Ts Lawcet 2023 Exam Date,Ts Lawcet 2023 Notification,Ts Lawcet 2Nd Phase Counselling Dates,Ts Lawcet 2Nd Phase Seat Allotment,Ts Lawcet Certificate Verification,Ts Lawcet Colleges,Ts Lawcet Counselling Documents,Ts Pglcet 2023

తెలంగాణ రాష్ట్రంలోని లా కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎల్ఎల్బీ (3 సంవత్సరాల కోర్సు)/ఎల్ఎల్బీ 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు) ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్-2023, 2 సంవత్సరాల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఎల్ సెట్-2023 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. సోమవారం ఈ షెడ్యూల్స్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మ‌న్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకట రమణ, ఉస్మానియా యూనివ‌ర్సిటీ వీసీ డి.ర‌వీందర్, ఈ పరీక్షల క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ బీ.విజ‌య‌ల‌క్ష్మి తో కలిసి విడుదల చేశారు. కాగా టీఎస్ లాసెట్-2023, టీఎస్ పీజీఎల్‌సెట్-2023 లను మే 25వ తేదీన నిర్వహించనున్నారు. 2023 సంవత్సరానికి గానూ లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.

టీఎస్ లాసెట్-2023, టీఎస్ పీజీఎల్‌సెట్-2023 ప్రవేశ పరీక్షల షెడ్యూల్:

  • నోటిఫికేషన్‌ విడుదల: మార్చి 1
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 2
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : ఏప్రిల్ 6
  • ఆలస్య రుసుము రూ.500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 12
  • ఆలస్య రుసుము రూ.1000 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 19
  • ఆలస్య రుసుము రూ.2000 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 26
  • ఆలస్య రుసుము రూ.4000 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 3
  • సబ్మిట్ చేసిన దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం: మే 4 నుంచి మే 10 వరకు
  • హాల్ టికెట్స్ డౌన్ లోడ్ : మే 16నుండి
  • టీఎస్ లాసెట్-2023, టీఎస్ పీజీఎల్‌సెట్-2023 పరీక్షల నిర్వహణ : మే 25
  • ప్రిలిమినరీ కీ ప్రకటన : మే 29
  • ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను సమర్పించడానికి చివరి తేదీ: మే 31 (సాయంత్రం 5 గంటలకు).

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 16 =