దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేస్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. ఈ క్రమంలో శనివారం ప్రధాన రేస్ జరుగనుండగా.. శుక్రవారం ప్రీ ప్రాక్టీస్ రేస్‌ను నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రీ ప్రాక్టీస్ రేస్ ప్రారంభమవనుంది. దీని కోసం నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో ప్రత్యేకంగా హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్ పేరుతో ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇక మొత్తం 18 మలుపులతో కూడిన 2.8 కిలోమీటర్ల ట్రాక్‌పై 11 జట్లు, ప్రతి జట్టులో ఇద్దరు డ్రైవర్లుతో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రేసును తిలకించేందుకు 22 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ట్రాక్ చుట్టూ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద మీడియా గ్యాలరీ, అదే ప్రాంతంలో వీఐపీల కోసం గ్రీన్ లాంజ్, వీవీఐపీల కోసం ప్రత్యేకంగా ఏస్ లాంజ్‌ను రేస్ ముగింపు పాయింట్ వద్ద ఏర్పాటు చేశారు. అలాగే ప్రేక్షకుల కోసం 16 గ్యాలరీలు ఉండగా, చిన్నారుల కోసం విడిగా పీపుల్స్ ప్లాజాలో ఫ్యాన్ విలేజ్ వేదికను సిద్ధం చేశారు.
ఇంకా రేసింగ్ ట్రాక్‌ను ఒకవైపు నుంచి మరో వైపుకు దాటేందుకు 4 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఇక దేశ, విదేశాల నుంచి ప్రేక్షకులు హాజరవుతున్న క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రేస్ పరిసర ప్రాంతాలపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఇటీవలే ఆరంభించిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను పార్కింగ్ ప్రదేశాలనుంచి రేసింగ్ ట్రాక్ వద్దకు నడపనున్నారు. ప్రేక్షకుల గ్యాలరీలను బట్టి 6 రకాలుగా టికెట్ రేట్లను నిర్ణయించారు. వీటిని.. రూ.1000, రూ.4,000, రూ.7,000, రూ.10,500, రూ.65,000లు రూ.1,25,000 వేలుగా నిర్ణయించారు. గురువారం నాటికి రూ.1000, రూ.4వేలు,రూ.10,500 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక మిగిన టికెట్లు బుక్‌మై షో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎంఎస్‌సిఐ) అధ్యక్షుడు అక్బర్ ఇబ్రహీం మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వగలదని నమ్మకంగా ఉన్నట్లు చెప్పారు. కాగా హైదరాబాద్ ఈ ప్రిక్స్ ఫిబ్రవరి 11 న నగరంలో జరగనుందని, నాలుగు ప్రత్యేక జంబో జెట్‌లు రేస్ కార్లు మరియు వివిధ రకాల పరికరాలను నగరానికి తీసుకురానున్నాయని తెలిపారు. దీనికి ముందు నవంబర్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్) జంట రేసుల సందర్భంగా ట్రాక్‌ను పరీక్షించామని, ఇక్కడ కార్లు గంటకు 320 కిమీ కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోతాయని వెల్లడించారు. ఇక ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్ సీజన్ తొమ్మిదిలో మొత్తం 11 జట్లు మరియు 22 మంది డ్రైవర్‌లు పాల్గొంటారని ప్రభుత్వంతో పాటు అసోసియేషన్ ఈ మెగా ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ఇది ఫార్ములా వన్ పిట్ లేన్ కంటే భిన్నంగా ఉంటుందని, మరియు కార్లను సులభంగా ఛార్జ్ చేయగల పిట్ లేన్‌లను రూపొందించడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని కూడా అక్బర్ ఇబ్రహీం వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE