
ఆసియాలో స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం ది బెస్ట్ సిటీస్ లిస్టులో హైదరాబాద్‌కు చోటు దక్కింది. 100 దేశాల్లోని 300 సిటీలను సర్వే చేసిన స్టార్టప్ జీనోమ్ అనే US స్టార్టప్ రీసెర్చ్ కంపెనీ.. ‘2024 గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్’ ఖండంలోని స్టార్టప్ స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం ఉత్తమ గమ్యస్థానాలలో మరో ఐదు భారతదేశపు సిటీలను కూడా చేర్చింది. పెర్ఫార్మెన్స్, ఫండింగ్, ట్యాలెంట్, ఎక్స్పీరియన్స్, అనుభవం, మార్కెట్, నాలెడ్జ్ ప్రమాణాల ఆధారంగా ఈ నగరాలను ఎంపిక చేశారు.
ఈ జాబితాలో .. టాప్ 30 ఆసియా నగరాల జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇది ఏడవ స్థానంలో నిలిచింది. దాని గ్లోబల్ ర్యాంక్ 2023లో ఎనిమిదో స్థానం ఉండగా ఉండగా అది కాస్తా ఇప్పుడు మరింత మెరుగుపడి ఏడో స్థానానికి చేరుకుంది. ఆసియాలో చూసుకుంటే ఢిల్లీ ఏడో ప్లేసులో ఉంది.ఇక గతంలో సింగపూర్ గ్లోబల్ ర్యాంక్‌లు వరుసగా 2020, 2021, 2022లో 16వ, 17వ, 18వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచ జాబితాలో యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీ టాప్‌లో ఉండగా, న్యూయార్క్, లండన్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి.
ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 స్టార్టప్ పర్యావరణ వ్యవస్థల లిస్టులో.. సిలికాన్ వ్యాలీ మొదటి స్థానంలో ఉండగా.. మిగతా స్థానాల్లో న్యూయార్క్,లండన్, టెల్ అవీవ్, లాస్ ఏంజెల్స్, బోస్టన్, సింగపూర్, బీజింగ్, సియోల్, టోక్యో, షాంఘై, వాషింగ్టన్ డిసి, ఆమ్స్టర్డ్యామ్-డెల్టా,పారిస్, బెర్లిన్, మయామి, చికాకూ, టొరంటో-వాటర్లూ, శాన్ డియాగో, సీటెల్ వరుసగా ఉన్నాయి. ఆసియాలో స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం.. టాప్ 30 ది బెస్ట్ సిటీస్ జాబితాలో హైదరాబాద్ 19వ స్థానంలో ఉండగా, బెంగళూరు మాత్రం ఆరో స్థానంలో నిలిచింది.
ఆసియాలో స్టార్టప్ ఎకో సిస్టమ్ పర్యావరణ వ్యవస్థల కోసం టాప్ 30 బెస్ట్ సిటీస్ నగరాల జాబితాలో సింగపూర్, బీజింగ్, సియోల్, టోక్యో, షాంఘై,బెంగళూరు, న్యూ ఢిల్లీ, షెన్‌జెన్, హాంగ్జౌ, ముంబై, హాంగ్ కాంగ్, జకార్తా, గ్వాంగ్జౌ, వుక్సీ, నాన్జింగ్, కౌలాలంపూర్, తైపీ సిటీ, చెన్నై, హైదరాబాద్,చెంగ్డు, బ్యాంకాక్, వుహాన్, మనీలా, కాన్సాయ్ ప్రాంతం, హో చి మిన్ సిటీ, పూనే, టియాంజిన్, జియామెన్, బుసాన్, హనోయి ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE