హైదరాబాద్‌లో ఇండియన్ కాఫీ ఫెస్టివల్.. ఇంకో రెండు రోజులే

Indian Coffee Festival In Hyderabad, Indian Coffee Festival, World Of Concrete India 2024, Coffee Festival Hyderabad Day, Workshops in Hyderabad September, Coffee Event in Hyderabad, Coffee Festival, Coffee Lovers, TICF, Latest Hyderabad News, CM Revanth Reddy, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Live Updates, Political News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

నో స్ట్రింగ్స్ హైదరాబాద్ నిర్వహిస్తున్న మొట్టమొదటి ఇండియన్ కాఫీ ఫెస్టివల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్, రోడ్ నెం. 51 వద్ద 2024 సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. ఆసియాలో మొట్టమొదటి కాఫీ టేస్టర్‌గా ఖ్యాతి గడించిన సునాలీని మీనన్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్, హైదరాబాద్ గారెత్ విన్ ఓవెన్ , ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ ఫౌండర్ చాందిని తదితరులు పాల్గొన్నారు.

ఈ ఫెస్టివల్ కు హాజరైనవారు కాఫీ టేస్టింగ్‌లు, లాట్ ఆర్ట్ సెషన్లు, నిపుణుల చర్చలు, బరిస్టా డిస్‌ప్లేలతో పాటు మరిన్నో స్పెషాలిటీలు కలిగి ఉన్న కాఫీ కల్చర్ యొక్క ఉత్సాహభరితమైన వేడుకల కోసం ఆస్వాదించవచ్చు. పిల్లలు, పెంపుడు జంతువుల కోసం జరిపే ప్రత్యేక ఈవెంట్లతో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో జరుపుకొనే ఈవెంట్లను కూడా ఈ ఫెస్టివల్ అందిస్తుంది.

కథా కాఫీ, కరాఫా కాఫీ, ట్రూ బ్లాక్ కాఫీ, బిగ్ స్టార్ కేఫ్, కరాబీ కాఫీ, అరకు కాఫీ, ఎంఎస్పి హిల్ రోస్టర్స్ , ఫస్ట్ క్రాక్ రోస్టర్స్, ఒడిస్సీ కాఫీలతో సహా భారతదేశంలోని కొన్ని అత్యుత్తమ కాఫీ బ్రాండ్లు అన్నీ ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నాయి. ఈ బ్రాండ్లు తమ సిగ్నేచర్ మిక్స్‌డ్ అండ్ ప్రీమియం కాఫీలను ప్రదర్శిస్తున్నాయి. సందర్శకులకు విభిన్న రకాల రుచులు, శైలులను రుచి చూసి మెచ్చుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి.

ఉత్సాహపూరితమైన ఫుడ్ అండ్ బేవరేజ్ కల్చర్‌కు పేరెన్నికగన్న హైదరాబాద్‌కు భారతదేశంలోనే తొలి కాఫీ ఫెస్టివల్‌ను తీసుకురావడం తమకు చాలా సంతోషంగా ఉందని నో స్ట్రింగ్స్ ఫౌండర్ శ్రీహరి చావా అన్నారు. కాఫీ, కేవలం ఒక పానీయం కాదని.. ఇది ఒక అనుభవం అని అన్నారు. ఈ ఫెస్టివల్ ద్వారా, కాఫీ ప్రేమికులకు కాఫీ ప్రపంచంలో మునిగిపోయే అవకాశాన్ని అందించాలనుకుంటున్నామని అన్నారు.

భారతీయ కాఫీ దృశ్యం అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతోందని నో స్ట్రింగ్స్ కో- ఫౌండర్ అనిరుధ్ బుదితి అన్నారు. కొత్తగా వచ్చినవాటితో పాటు ఇప్పటికే పేరొందిన బ్రాండ్లు కలిసి, కాఫీ ప్రేమికులు ఉత్సాహభరితంగా కాఫీ పట్ల తమ అభిరుచిని ప్రదర్శించే వేదికను రూపొందించడానికి తాము సంతోషిస్తున్నాము’అని అన్నారు.

ఇండియన్ కాఫీ ఫెస్టివల్, సందర్శకులు శాకాహారతో పాటు వేగన్ల కోసం ఇక్కడ ఎన్నో అనుభవాలను ఇక్కడ పొందొచ్చు. హైదరాబాద్లోని స్థానిక ప్రతిభావంతుల నుంచి లైవ్ మ్యూజిక్ ప్రదర్శనలు కూడా కాఫీ ప్రేమికులను ఆకట్టుకోనున్నాయి. సమ్ థింగ్స్ బ్రూయింగ్, బుడాన్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్ మరియు సిద్స్ ఫార్మ్ సహకారంతో మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ నిర్వహించబడుతుంది. సో..హైదరాబాద్లో జరుగుతున్న ఈ వినూత్న వేడుకలో పాల్గొనేందుకు కాఫీ ప్రియులు ఓసారి వెళ్లొచ్చి తమ అనుభవాన్ని షేర్ చేసుకోవచ్చు.