దేశంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భరత మాత, జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నమస్కరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తక్కువ మందితో నిబంధనలకు అనుగుణంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ పార్టీ ఇన్‌ఛార్జి శంకర్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu