జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే. తనకు ఒక్కమాట కూడా చెప్పకుండా సంజయ్‌ను పార్టీలోకి చేర్చుకోవడంతో తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ హైకమాండ్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే టి.కాంగ్రెస్ పెద్దలు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనతో సమావేశమై జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా మరికొంత మంది నేతలు వెళ్లి జీవన్ రెడ్డి కలిశారు.
అయినప్పటికీ జీవన్ రెడ్డి సంతృప్తి చెందలేదు. ఈక్రమంలో సంచలన జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. పదవికి రాజీనామా చేసినప్పటికీ.. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. త్వరలోనే తన కార్యకర్తలు, అనుచరులతో సమావేశమవుతానని.. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని.. ఏ పార్టీ నుంచి కూడా తనకు పిలుపు రాలేదని అన్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ వస్తున్నానని.. అయినప్పటికీ తనకు పార్టీలో సరైన గౌరవం దక్కలేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఆయనకు ఫోన్ చేశారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షీ తాను హైదరాబాద్ రాగానే అన్ని విషయాలు మాట్లాడుతానని జీవన్ రెడ్డికి హామీ ఇచ్చారట. ఇకపోతే 1983లో తొలిసారి టీడీపీ తరుపున ఎన్నికల్లో జీవన్ రెడ్డి పోటీ చేశారు. జగిత్యాల నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి గెలుపొందారు. ఆ తర్వాత కొద్దిరోజులకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. 1989, 96, 99, 2004, 2014లలో కాంగ్రెస్ తరుపున జగిత్యాల నుంచి పోటీ చేసి గెలుపొందారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE