సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

Gujarat, Koppula Eshwar Visits Delhi, Koppula Eshwar Visits Sardar Vallabhai Patel Statue, Mango News, Minister Koppula Eshwar, Minister Koppula Eshwar Latest News, Minister Koppula Eshwar News, Minister Koppula Eshwar Visits Gujarat, Minister Koppula Eshwar Visits Sardar Vallabhai Patel Statue, Minister Koppula Eshwar Visits Sardar Vallabhai Patel Statue at Gujarat, Telangana Minister Koppula Eshwar

గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం నాడు సందర్శించారు. 597 అడుగుల ఎత్తు ఉన్న ఈ కాంస్య విగ్రహం, ప్రపంచంలోని విగ్రహాలన్నింటిలో అతి పెద్దది అనే విషయం తెలిసిందే. నర్మదా నది లోయలోని కేవాడియా వద్ద సాధూబెట్ అనే చిన్న దీవిలో 2 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా రాజ్యాంగ నిర్మాత, మహనీయులు భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠించనున్న విషయం విదితమే.

అంబేద్కర్ 125 అడుగుల (పీఠంతో కలిపి 175అడుగులు ) విగ్రహం నిర్మాణం ఏర్పాట్లు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొప్పులఈశ్వర్ సంబంధిత శాఖ అధికారులను తన వెంట తీసుకుని మంగళ, బుధవారాలు ఢిల్లీ పరిసరాలలో ఉన్న పలు విగ్రహాల తయారీ స్టూడియోలను సందర్శించారు. అలాగే, గురువారం కేవాడియా చేరుకుని సర్దార్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. పటేల్ జీవితచరిత్రకు సంబంధించిన ఫోటో గ్యాలరీ, ప్రదర్శన శాల, లేజర్ షోలను మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన,అందుకు సంబంధించిన విశేషాలను అక్కడి అధికారులు మంత్రి కొప్పులకు వివరించారు. విగ్రహ నిర్వహణ, అక్కడి పరిసరాలు, పరిశుభ్రత, సుందరీకరణను మంత్రి కొప్పుల ఈశ్వర్ నిశితంగా పరిశీలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − nine =