ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు ఈరోజు (శుక్రవారం, నవంబర్ 14, 2025) మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికగా ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది.
| రౌండ్లు | కాంగ్రెస్ | బీఆర్‌ఎస్ | బీజేపీ |
|---|---|---|---|
| 1 | 8,926 | 8,864 | 1434 |
| 2 | 9,691 | 8,609 | 2041 |
| 3 | 12,292 | 12,503 | 1073 |
| 4 | 17,874 | 14,879 | 1156 |
| 5 | — | — | — |
| 6 | — | — | — |
| 7 | — | — | — |
| 8 | — | — | — |
| 9 | — | — | — |
| 10 | — | — | — |
ఓట్ల లెక్కింపు వివరాలు:
రౌండ్లు: ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున, కౌంటింగ్‌ను 10 రౌండ్లలో పూర్తి చేయనున్నారు.
ఫలిత సమయం: ఒక్కో రౌండ్ ఫలితానికి కనీసం 40 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నందున, మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.
భద్రత: లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 144 అమలులో ఉంటుంది.
రాజకీయ విశ్లేషణ:
పోటీ: ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ (నవీన్ యాదవ్), భారాస (మాగంటి సునీత), భాజపా (లంకల దీపక్ రెడ్డి) మధ్య త్రిముఖ పోరుగా మారింది.
ఉత్కంఠ: ఈ ఎన్నిక రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. 48.49 శాతం అతి తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది.
అంచనాలు: ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార కాంగ్రెస్‌కు 6 నుంచి 9 శాతం వరకు ఆధిక్యం వస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ, సిట్టింగ్ స్థానం తమకే దక్కుతుందని భారాస విశ్వాసం వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ ఉపఎన్నికలో విజేతగా నిలవాలంటే సదరు అభ్యర్థి సుమారు 97 వేల ఓట్లు సాధించాల్సి ఉంటుంది. విజేత ఎవరనేది కొద్దిసేపట్లోనే తేలనుంది.







































