ద‌యాక‌ర్‌రావుకు జ‌య‌హో అంటున్న పాల‌కుర్తి

Palakurti says jayaho to dayakar rao,Palakurti says jayaho,Palakurti to dayakar rao,jayaho to dayakar rao,Mango News,Mango News Telugu,errabelli dayakar rao, Errabelli, palakurthy, telangana politics, telangana assembly elections,Palakurthi Public Response On MLA Errabelli,Palakurthi BRS MLA Candidate,Minister Errabelli Dayakar Rao,Errabelli Dayakar Rao Latest News,Errabelli Dayakar Rao Latest Updates,Errabelli Dayakar Rao Live News
errabelli dayakar rao, Errabelli, palakurthy, telangana politics, telangana assembly elections

ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వ్య‌క్తిత్వం తెలియాలంటే.. పాల‌కుర్తి  ప్ర‌జ‌ల‌ను అడ‌గాలి.. ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రాజ‌కీయ అనుభ‌వం గురించి తెలియాలంటే వికీపీడియా చూడాలి.. ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చేసిన అభివృద్ధిని చూడాలంటే.. పాల‌కుర్తి వెళ్లాలి.. నిజ‌మే అక్క‌డికి వెళ్లి చూసినా.. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఆయ‌న గురించి అడిగినా ఒక‌టే అనిపిస్తుంది.. వినిపిస్తుంది.. ఆయ‌న లీడ‌ర్ అని. అందులో ఏ మాత్రం అతిశ‌యోక్తి లేదు. ఎందుకంటే.. తాను న‌మ్మిన ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవ‌డంలోనూ.., త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసుకోవ‌డంలోనూ ఎర్ర‌బెల్లి నాయ‌కుడిగా త‌న క‌ర్త‌వ్యం నెర‌వేర్చారు. రాజకీయ వ్యూహాలు రచించడంలోనూ ఆయ‌న అసలు సిసలైన ప్రజానాయకుడు.

నిరంత‌రం చిరునవ్వు తో ప్ర‌జాక్షేత్రంలో తిరుగుతూ ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని ప‌రిష్క‌రించ‌డం ఆయ‌న‌కు దిన‌చ‌ర్య‌గా మారింది. అందుకే ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఏకంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా అంద‌లం ఎక్కించారు. మ‌రోసారి కూడా ఆయ‌న‌ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌చారంలో ఆయన‌కు ద‌క్కుతున్న ప్ర‌జాద‌ర‌ణ ద్వారా అర్థం అవుతోంది. 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి రాజ‌కీయ అడుగులు ప్రారంభించి ఎర్ర‌బెల్లి తొలిసారి ఓట‌మి చెందిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత నుంచి వెనుదిరిగి చూడ‌లేదు. 1994 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం విజయం ఎర్రబెల్లి దయాకర్ రావును వరించింది.

2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2009 శాసనసభ ఎన్నికలలో పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. 2014లో తిరిగి పాలకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొంది ఐదు సార్లు వరుసగా శాసనసభకు ఎన్నికైన నాయకునిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుని తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. అంతకుముందు 2008 ఉప ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా కూడా గెలుపొందారు. రాష్ట్ర అవ‌త‌ర‌న అనంత‌రం మారిన రాజకీయ ప‌రిస్థితుల మేర‌కు 2016 లో టీఆర్ ఎస్ లో చేరిన ఆయ‌న 2018లో ఆయ‌న పాల‌కుర్తి నుంచి బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించారు.

నిత్యం ప్రజాసంక్షేమం కోసం, తన ప్రాంత అభివృద్ధి కోసం పరితపించే దయాకర్ రావును స్థానికులు దయన్న గా పిలుస్తారు. పాల‌కుర్తిలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ద్వారా కేంద్రానికి లేఖ ఇప్పించడంలో సఫలీకృతమయ్యారు. సమాజాన్ని , ప్రజాసమస్యలను అధ్యయనం చేసిన దయాకర్ రావు సమకాలిక రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుని ప్రతిరోజు వార్తల్లోని వ్యక్తిగా చలామణి అవుతూ వచ్చారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హ‌కారంతో పాల‌కుర్తిని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారు. దేశం మెచ్చిన పంచాయతీరాజ్‌ మంత్రిగా గుర్తింపు సాధించి కేంద్రం ప్రకటించిన అనేక అవార్డులకు ఆయన పని తీరుకు కొలమానంగా నిలువడంతో పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. వందల కోట్ల నిధులతో పాలకుర్తి నియోజకవర్గం ఎనిమిదేళ్లలో నూతన రూపురేఖలను సంతరించుకుంది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలకుర్తి రిజర్వాయర్‌, నియోజకవర్గంలోని ఆరుమండల కేంద్రాలను అభివృద్ధి, జంక్షన్లు, రోడ్లవిస్తరణ, సెంట్రల్‌లైటింగ్‌, సీసీ రోడ్లు, డివైడర్లు, డ్రైనేజీల నిర్మాణం, పాలకుర్తిలో రాజీవ్‌ చౌరస్తా విస్తరణ, రాయపర్తిలో బస్టాండ్‌ సెంటర్‌ ఆధునీకరణ, దేవరుప్పులలో సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్ల విస్తరణ, కొడకండ్లలో రోడ్ల విస్తరణలో నియోజ‌క‌వ‌ర్గాన్ని ముందంజ‌లో ఉంచారు. రైతు బీమా ద్వారా నియోజకవర్గంలోని 1027 కుటుంబాలకు రూ.51.35 కోట్లు సాయంగా అందించారు.

డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు, కల్యాణ లక్ష్మీ/షాదీముబారక్‌, నూతన పంచాయ‌తీ భ‌వ‌నాలు, చెక్‌డ్యాములు, మిషన్‌భగీరథ, మన ఊరు – మన బడి వంటి కార్య‌క్ర‌మాల ద్వారా నియోజ‌క‌వ‌ర్గాన్ని ముందు వ‌రుస‌లో ఉంచారు. మంత్రి గా త‌న‌కున్న ప‌లుకుడిని స్వార్థానికి కాకుండా,  త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి వినియోగించుకుంటూ… అంద‌రి మ‌న్న‌న‌లూ పొందుతున్నారు. దేవాదుల, మిషన్‌ కాకతీయ, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ని యోజకవర్గంలో అదనంగా 74 వేల 988 ఎకరాలను సా గులోకి తెచ్చారు. దీంతో మొత్తం లక్షా 31వేల 894 ఎకరాలకు సాగునీటి సౌకర్యం ఏర్పడింది. పాలకుర్తి – బమ్మె ర – వల్మిడి కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నారు. చేనేత పరిశ్రమపై ఆధారపడిన నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు వరంగల్‌లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్‌ టైల్‌ పార్‌ తరహాలోనే కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పా టు చేయబోతున్నారు. ఇలా అన్ని ర‌కాలుగానూ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ గా మార్చ‌డంతో.. స్థానికులు కూడా మ‌రోసారి ఆయ‌న‌ను ఎమ్మెల్యే ద‌యాక‌ర్‌రావును చేయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు స‌ర్వేలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + seventeen =