కాలం ఎప్పుడూ మనకే అనుకూలంగా ఉండదు. అది ఎప్పుడు ఎవరికి అనుకూలంగా మారుతుందో ఎవరికీ తెలియదు. కాలం ఎల్లప్పుడూ మనకే అనుకూలంగా ఉంటుంది అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. ఎన్నికల ముందు తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చేది తామేనని గులాబీ బాస్ రొమ్ము విరుచుకొని చెప్పారు. మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో తమను ఢీ కొట్టేవారే లేరని భావించారు. కానీ ఒక్కసారిగా కాలం గిర్రున తిరిగింది. అసలు తెలంగాణలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా పూర్వవైభవాన్ని సంతరించుకుంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను గద్దె దించి అధికార పీఠం ఎక్కింది. అయితే ఈసారి బెడిసికొట్టినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా మాదే అధికారమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అవును.. ఇంతటితో అయిపోలేదని మళ్లీ తాము అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నారు. ఆరేళ్ల కాంగ్రెస్ పాలనలో తప్పులు, పాలనా పరంగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను ఎత్తిపొడుస్తూ.. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో తమదే అధికారమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ చల్లబడిపోయింది. కానీ నెల రోజులకే ఓటమి నుంచి తేరుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయడం మొదటు పెట్టింది. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం అన్ని సరి చేసుకునేందుకు సమయం ఇస్తామని ముందు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. కానీ నెలా.. రెండు నెలలు కూడా కాకముందే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ నేతలు పోరు బాట పట్టారు. వెంటనే హామీలను నెరవేర్చాలంటూ నిలదీశారు.
ఆ వెంటనే కొద్దిరోజులుగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా హవా చాటాలని బీఆర్ఎస్ భావించింది. అత్యధిక స్థానాలు దక్కించుకుంటే ఢిల్లీలో చక్రం తిప్పొచ్చిన వ్యూహాలు రచించింది. కానీ అసెంబ్లీ ఎన్నికలంటే దారుణంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బోల్తా పడింది. ఒక్క స్థానం అంటే.. ఒక్క స్థానాన్ని కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. ఉన్న 17 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో ఎనిమిది పంచుకుంటే.. మిగిలిన ఒక్క స్థానాన్ని ఎంఐఎం దక్కించుకుంది. కానీ బీఆర్ఎస్ ఎక్కడా కూడా ఖాతా తెరవలేదు. ఒక్క స్థానాన్ని కూడం బీఆర్ఎస్‌కు దక్కలేదంటే.. తెలంగాణ ప్రజలు ఆ పార్టీపైన ఎంతటి వ్యతిరేకతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌లో కాన్ఫిడెన్స్ లెవల్స్ ఏమాత్రం తగ్గలేదు.
ఆరు.. నూరయినా వచ్చే ఎన్నికల తర్వాత తామే అధికారంలోకి వస్తామని కేసీఆర్ చెబుతున్నారు. రావడమే కాదు వరుసగా మూడుసార్లు అధికారంలోకి వస్తామని.. తెలంగాణలో పదిహేనేళ్లు తమ పాలనే కొనసాగుతుందని అంటున్నారు. ఇటీవల ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్‌లతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణ కాంగ్రెస్ పాలన ఫెయిల్ అవుతుందని.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎసేనని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో కరెంట్ కోతలు.. తాగునీటి కొరత ఏర్పడిందని అన్నారు. గత పదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఈ కష్టాలు లేకుండా చూసుకున్నామని తెలిపారు. పిచ్చి పిచ్చి పనులతో ప్రజలతో కాంగ్రెస్ వ్యతిరేకతను మూట కట్టుకుంటుందని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో గతంలో ఎన్టీఆర్ హయాంలో జరిగిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. అప్పుడు కూడా ఎన్టీఆర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారన్నారు. ఆ తర్వాత తిరిగి ఎన్టీఆర్ అధికారలోకి వచ్చారని వెల్లడించారు. ఆ హిస్టరీనే ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందని.. తిరిగి తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరి కేసీఆర్ అంటున్నట్లుగానే తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఫెయిల్ అవుతుందా? హిస్ట్రీ రిపీట్ అవుతుందా? అన్నది చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE