ఉస్మానియా యూనివర్సిటీలో నేడు ‘జనసేన’ విద్యార్థి గర్జన

Janasena Latest Updates, Janasena Student Garjana In Osmania University, Mango News Telugu, Pawan Kalyan Janasena Latest News, Political Updates 2020, Student Garjana In Osmania University, Telangana Breaking News, Telangana Political Updates, Telangana Political Updates 2020
హైదరాబాద్ లో జనవరి 5, ఆదివారం నాడు జనసేన పార్టీ విద్యార్థి గర్జన నిర్వహించనుంది. ఉస్మానియా యూనివర్శిటీ లోని ఆర్ట్స్ కాలేజ్‌లో ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటలకు విద్యార్థి గర్జన నిర్వహించనున్నట్టు పార్టీ ప్రతినిధులు తెలిపారు. నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం, బడుగు బలహీన వర్గాల వారిపై జరుగుతున్న దాడులు అరికట్టడం, మహిళలపై దాడులు అరికట్టి, చట్టాల అమలుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, మారుతున్న వ్యవస్థలకనుగుణంగా ఉద్యోగాల కల్పనకు విద్యావ్యవస్థలో మార్పులు తేవడం వంటి
డిమాండ్లతో ఈ గర్జన నిర్వహించనున్నట్లు జనసేన ప్రతినిధులు ప్రకటించారు. యావత్ తెలంగాణ విద్యార్థులు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో ఈ విద్యార్థి గర్జనలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here