తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో కొనసాగింది బీఆర్ఎస్ పార్టీ. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా చమటోడ్చినప్పటికీ.. గతేడాది జరిగిన ఎన్నికల్లో చితకలపడిపోయింది. కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా మెజార్టీ స్థానాలను దక్కించుకొని ఢిల్లీలో చక్రం తిప్పాలని భావించింది. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సరికి బీఆర్ఎస్ మనుగడ మరింత కష్టంగా మారింది. కనీసం ఒక్కస్థానాన్ని కూడా పార్లమెంట్ ఎన్నికల్లో దక్కించుకోలేక పోయింది. ఈసమయంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పుంజుకుంటున్నాయి. అటు ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ.. తెలంగాణపై కూడా దృష్టి పెట్టింది. ఇక్కడ కూడా తమ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో చూస్తూ ఉండిపోతే తమ పార్టీ మనుగడ కష్టమేనని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఛేంజ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట.
ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఉన్నారు. ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. పార్టీలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యత పెరిగేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారట. అందులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వడం ద్వావరా దళిత, బహుజన వర్గాలను ఆకట్టుకోవచ్చని కేసీఆర్ అనుకుంటున్నారట. ఇప్పటికే పార్టీ నేతలతో చర్చలు కూడా జరిపారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE