తెలంగాణ గీతం.. కీర‌వాణి సంగీతం!

Telangana songs , Keeravani Music , Telangana State
Telangana songs , Keeravani Music , Telangana State

తెలంగాణ ఖ్యాతిని, కీర్తిని చాటేలా.. కొత్త ప్ర‌భుత్వంలో కొత్త గీతం రెడీ అయింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు కొంగొత్త‌గా అందుబాటులోకి తెస్తున్నారు. ప్ర‌భుత్వ సూచ‌న మేర‌కు అందెశ్రీ గీతంలో మార్పులు చేశారు. ఆ గీతంలో తెలంగాణ అవిర్భావం ఎలా జరిగింది, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక కొన్నింటిలో త‌మ‌దైన ప్ర‌త్యేక‌త చూపాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే.. తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్‌ బదులుగా టీజీగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్‌హెడ్‌లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, అధికారిక కమ్యూనికేషన్లలో తెలంగాణ కోడ్‌ టీఎస్‌కు బదులుగా టీజీ వినియోగించాలని  పేర్కొంది. ప్ర‌భుత్వ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌చ్చాయి కూడా. అధికారిక స‌మాచారంలో టీజీనే పొందుప‌రుస్తున్నారు.

ఈక్ర‌మంలోనే ఇప్పుడు తెలంగాణ గీతంలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప‌లువురు మేధావులు, క‌వుల‌తో  చ‌ర్చించిన త‌ర్వాతే ఈ మార్పులు చేసిన‌ట్లు ప్ర‌భుత్వం చెబుతోంది. జూన్ 2వ తేదీన ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీతో ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆరోజున సోనియాను ఆహ్వానించాల‌ని ఇప్ప‌టికే కేబినెట్ లో నిర్ణ‌యించారు. త‌మ నిర్ణ‌యాన్ని అధిష్ఠానానికి తెలియ‌జేశారు. సోనియా రాక అధికారికంగా ఖ‌రారు కావాల్సి ఉంది. కాగా.., జయ జయహే తెలంగాణ గీతం ఒకటిన్నర నిమిషం నిడివిలో అవుతోంది. సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న.. ఇంతవరకు రాష్ట్రం గీతం లేకుండేది. గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర గీతం ఉండాలని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో అందెశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని అమోదిస్తూ కేబినెట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఈ గీతాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానే ఆ గీతం రాసిన అందెశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది. అందులో భాగంగా అందెశ్రీ ఈ గీతంలో మార్పులు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదముద్ర వేసింది. ఆ గీతాన్ని సినీ సంగీత దర్శకుడు కీరవాణితో కంపోజింగ్ చేశారు. జూన్2న రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో విడుద‌ల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  అందెశ్రీ, కీరవాణి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తెలంగాణ గీతాన్ని వినిపించారు. ఈ గీతం చాలాబాగుందని రేవంత్ కితాబిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY