సమతా కుంభ్-2023: స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వద్ద నేడే విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం

Samatha Kumbh-2023 Mass Chanting of Bhagavad Gita Today at 1 PM at Statue of Equality,Kumbh 2023,Kumbh 2024,2023 Kumbh Mela,Kumbham 2023,Kumbam Sathayam 2023,Next Kumbh Mela 2023,Samantha Kumbh,Samantha Kumbh 2023,Samantha Kumbh 2023 Latest News,Samantha Kumbh 2023 News And Updates,Bhagavad Gita Chanting All The 18 Chapters,Avadhoota Datta Peetham Bhagavad Gita,Bhagavad Gita Chanting Benefits,Bhagavad Gita Guinness World Record,Chanting Of Bhagavad Gita,Largest Simultaneous Hindu Text Recital,Mahatma Gandhi On Bhagavad Gita

హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లోని సమతా మూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) స్ఫూర్తి కేంద్ర ప్రాంగణంలో సమతా కుంభ్-2023 ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు (ఫిబ్రవరి 11, శనివారం) మధ్యాహ్నం 1 గంటకు సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం (భగవద్గీత పారాయణం) కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కనీ వినీ ఎరుగని రీతిలో, లక్షమందితో భారీ స్థాయిలో జరగనుంది. సామూహిక భగవద్గీత పారాయణం కోసం తెలుగు రాష్ట్రాలు, దేశంలోని పలు రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానుండడంతో విస్తృత ఏర్పాట్లు చేశారు.

సకల లోక గురుడికి, సర్వ వేద విదుడికి, వేదాంత వీధీ విహారికి, బ్రహ్మ విద్యా ప్రదాతకి, అర్జున సారథికి వినయంతో, విశ్వాసంతో, కృతజ్ఞతతో సమర్పించే విశ్వ శాంతి విరాట్ గీతా పారాయణ కార్యక్రమాన్ని రామానుజుల వారి సన్నిధిలో శ్రీ చినజీయర్ స్వామి నేతృత్వంలో ఘనంగా నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి రథోత్సవం, నిత్యా పూర్ణావుతి అనంతరం విరజా పుష్కరిణిలో చక్రస్నానం వంటి కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.

ఇక సమతా కుంభ్-2023లో భాగంగా ఫిబ్రవరి 10, శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలు, యుక్తవయస్కులు మరియు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడంతో ఉదయం 9.30 గంటలకు సుముహూర్తం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా నమోదు చేసుకున్న 75 మందికి పైగా ఉపనయనం తీసుకున్నారు. త్రిదండి చినజీయర్ స్వామీజీ స్వయంగా ఈ వేడుకలను ప్రారంభించారు. మధ్యాహ్నం 1.30 నుంచి 4.30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, మైథిలీరావుచే భక్తి నృత్య ప్రదర్శన జరిగింది. చినజీయర్ స్వామీజీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సమతా కుంభ్-2023లో భాగంగా స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ మరియు 108 దివ్యదేశాల విగ్రహల సృష్టిలో భాగమైన ఆర్కిటెక్ట్, వాస్తు శిల్పులను సన్మానించారు.

అలాగే సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సాకేత రామచంద్ర ప్రభువుకు గజవాహన సేవ, 18 దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు నిర్వహించారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్న భారీ భక్తజనసందోహంతో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరుస్తున్నాయి. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో పెరుగుతున్న సందర్శకుల రద్దీకి అనుగుణంగా అదనపు షామియానాలతో విశాలమైన పార్కింగ్ మరియు భోజనాల ఏర్పాట్లు చేయబడ్డాయి.

సమతా కుంభ్-2023: 10వ రోజు (ఫిబ్రవరి 11, శనివారం) షెడ్యూల్:

  • ఉదయం 5.45 గంటలకు: సుప్రభాతం
  • 6- 630: అష్టాక్షరి మంత్రంతో ధ్యానం
  • 6.30-7.30 ఆరాధన, సేవా కాలం
  • 7.30-9: శాత్తుముఱై, తీర్థ ప్రసాద గోష్టి
  • 9-10గంటలు వరకు: రోజువారీ పూర్ణాహుతి, బలిహరణ.

ఫిబ్రవరి 11, శనివారం ప్రత్యేక కార్యక్రమాలు:

  • ఉదయం 9 గంటలకు: రథోత్సవం, చక్ర తీర్ధం ఇన్ విరాజ పుష్కరిణి
  • మధ్యాహ్నం 1 గంట నుండి – భగవద్గీత సామూహిక పఠనం
  • రాత్రి 7.30-8 గంటలకు రోజువారి పూర్ణాహుతి, మంగళ శాసనం, మహాప్రసాదం పంపిణీ.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 15 =