ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్‌

Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Danam Nagender, Danam Nagender Tested Positive, Khairatabad, Khairatabad TRS MLA, Khairatabad TRS MLA Danam Nagender Tested Positive, Khairatabad TRS MLA Danam Nagender Tested Positive for COVID-19, Mango News, MLA Danam Nagender Tested Positive for COVID-19, telangana corona district wise cases, Telangana Coronavirus Cases, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, TRS MLA Danam Nagender, TRS MLA Danam Nagender Tested Positive for COVID-19

మూడో వేవ్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

“నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు మరియు మందులు తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అని దానం నాగేందర్ పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో జనవరి 23, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,34,815 కి చేరింది. ఇప్పటివరకు 6,98,649 మంది రికవరీ కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 32,094 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF