తెలంగాణలో ఫీవర్‌ సర్వే.. లక్ష మందిలో వెలుగు చూసిన కోవిడ్‌-19 లక్షణాలు

1 Lakh People To Be Having COVID-19 Symptoms In Telangana, COVID-19, Covid-19 Live Updates, Covid-19 New Updates, Door To Door Fever Survey, Door To Door Fever Survey In Hyderabad, Health Minister of Telangana, Health Minister T Harish Rao, Mango News, Minister T Harish Rao, Omicron, Omicron Cases, Omicron covid variant, Omicron variant, Telangana Fever Survey, Telangana Fever Survey Shows Over 1 Lakh People, Telangana Fever Survey Shows Over 1 Lakh People Found To Be COVID-19 Symptoms, Telangana Fever Survey Shows Over 1 Lakh People To Be Having COVID-19 Symptoms, Telangana Health Minister T Harish Rao, Update on Omicron

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫీవర్‌ సర్వేలో.. తొలి రెండు రోజుల్లోనే సంచలన స్థాయిలో లక్ష మందికి పైగా కోవిడ్‌-19 లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు. వైద్య, ఆరోగ్య శాఖ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పంచాయతీరాజ్‌ తదితర శాఖల సమన్వయంతో జనవరి 21న ఇంటింటి సర్వేను ప్రారంభించింది తెలంగాణ సర్కార్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి), ఇతర మునిసిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు గ్రామ పంచాయితీలలో.. జ్వరం, జలుబు మరియు దగ్గుతో పాటు ఇతర లక్షణాలతో ఎవరైనా బాధపడుతున్నారేమో తెలుసుకోవటంకోసం ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తున్నారు.

ఆదివారం హైదరాబాద్‌కు సమీపంలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఫీవర్ సర్వేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు పరిశీలించారు. మొదటి రెండు రోజుల సర్వేలో 29.20 లక్షల ఇళ్లుకు గాను, కోవిడ్ -19 లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వారికి లక్ష కిట్లను పంపిణీ చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అయితే, ప్రజలెవరూ దీనిని గురించి భయాందోళన చెందవద్దని మంత్రి అన్నారు. ఆక్సిజన్ సహా అవసరమైన అన్ని మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని.. అలాగే, హోం ఐసోలేషన్ కిట్‌లను కూడా ఉచితంగా సరఫరా చేస్తున్నందున కోవిడ్ లక్షణాలు ఉన్నవారు మందుల కొనుగోలు కోసం మెడికల్ స్టోర్‌లకు వెళ్లవద్దని ఆయన సూచించారు.

కోవిడ్ పాజిటివ్ గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా వార్డులు మరియు ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు. కోవిడ్‌కు పాజిటివ్‌గా పరీక్షించిన గర్భిణీ స్త్రీలు కూడా ఆందోళన చెందవద్దని, వారి చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ ఆసుపత్రులలో చేసినట్లు ఆయన అన్నారు. కోవిడ్ కేసుల చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా 56,000 పడకలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ఫీవర్‌ సర్వే పూర్తవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

ఫీవర్‌ సర్వే ద్వారా అందిస్తున్న ప్రతి కిట్‌లో ఏడు మందులు మరియు వాటిని ఎలా ఉపయోగించాలో సలహా ఉంటుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి అజిత్రోమైసిన్, పారాసెటమాల్, లెవోసెటిరిజైన్, రానిటిడిన్, విటమిన్ సి, మల్టీవిటమిన్ మరియు విటమిన్ డి ఉన్నాయి. కిట్‌లో అందించిన మందులను ఐదు రోజుల పాటు తీసుకోవాలి. ప్రభుత్వం వద్ద కోటి కిట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కేసులు తగ్గుముఖం పట్టాయని హరీశ్ రావు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 3 =