గెలుపు ధీమాను పెంచిన ఖమ్మం సెగ్మెంట్

Khammam ,Mallu Nandini, V. Hanumantha Rao, Puvwalla Durgaprasad, Ponguleti Srinivas Reddy,Sonia Gandhi, Renuka Chaudhary, BRS, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Mango News, Mango News Telugu
Khammam ,Mallu Nandini, V. Hanumantha Rao, Puvwalla Durgaprasad, Ponguleti Srinivas Reddy,Sonia Gandhi and Renuka Chaudhary

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుని.  తమకు తిరుగులేదని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే గెలిచే అభ్యర్థుల కోసం వేట ప్రారంభించి.. ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్‌లో అన్ని పార్టీల ఫోకస్  ఖమ్మం టికెట్ చుట్టే ఉండటం హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలంతా లోక్ సభ ఎన్నికల బరిలో దిగడానికి  ఖమ్మం స్థానాన్నే ఎంచుకోవడంతో ఖమ్మం టికెట్ హాట్ సీట్‌గా మారిపోయింది.

కారణం తెలియదు కానీ.. ఖమ్మం టికెట్ కోసం  కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు పోటీ పెరగడం  పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. తాజాగా  ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని కూడా దరఖాస్తు చేసున్నారు. అలాగే అదే స్థానం నుంచి తనకూ  టికెట్  కావాలని సీనియర్ నేత వీ.హనుమంతరావు కూడా దరఖాస్తు పెట్టుకోవడం ఇప్పుడు పార్టీలో ఆసక్తిని రేపుతోంది. అంతేకాదు వీరితో పాటు ఖమ్మం డీసీసీ చీఫ్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా  పోటీకి సిద్దంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక వైపు ఖమ్మం టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటే..మరోవైపు అక్కడ పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కొన్నిసార్లు తన మనసులోని కోరికను బయటపెడుతూనే ఉన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఖమ్మం స్థానం నుంచే పోటీ చేయబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అయితే సోనియా  పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నా కూడా అదే  స్థానం నుంచి పోటీ చేస్తామని ముఖ్యనేతలు పోటీ పడటం అక్కడ చర్చనీయాంశం అయింది.

ఖమ్మం పార్లమెంట్ స్థానం ఎప్పుడూ కూడా  కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తోంది. దీనికి తోడు ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం హవా జోరుగా వీయడం కాంగ్రెస్ పార్టీలో జోష్‌ నింపింది. అందుకే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కీ రోల్ పోషించిన ఖమ్మం ..ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ హాట్ కేక్ గా మారిపోయింది. అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన జోష్‌తో  ఖమ్మం లోక్ సభ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ హస్త గతం చేసుకుంటుందన్న నమ్మకాన్ని పెంచింది.

దీంతోనే ఇక్కడ పోటీ చేస్తే పక్కాగా గెలుస్తామనే లెక్కలతోనే నేతలంతా ఖమ్మం సీటు కోసం తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.  ఒక వేళ ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే ఓకే కానీ ఆమె పోటీ చేయకపోతే టికెట్ కన్ఫమ్ చేయించుకుంటే చాలు విజయం దానంతట అదే వస్తుందన్న పొలిటికల్ లెక్కలు అక్కడి నేతల్లో ధీమాను పెంచేసాయి. దీంతో ఖమ్మం టికెట్ పాలిటిక్స్ తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE