ఆ లక్షణాలు ఉంటే జాగ్రత్త పడాల్సిందే..

Cyber chondria, cyber chondria symptoms, be careful,Health, Doctor, Medical symptoms, Health Care, Chondria Treatment, ‎Signs of Cyberchondria, Cyberchondria Causes, Health updates, Health Tips, Health care, Mango News, Mango News Telugu,Health Management
cyber chondria, cyber chondria symptoms, be careful,Health, Doctor, Medical symtoms, Health Care

సాధారణంగా ఎవరికైనా కాస్త ఒంట్లో నలతగా ఉన్నా లేక ఏదైనా  అనుమానం కనిపించే మెడికల్ సింప్టమ్స్ కనిపించినా కంగారు పడతారు. అలాగే  తమకు  కావాల్సిన వాళ్లు ఎదుర్కొనే హెల్త్ ఇష్యూస్ గురించి భయపడుతూ ఉంటారు.  తమలోని అనుమానాలను, భయాలను  తెలుసుకోవడానికి  రోజులో ఎక్కువ సార్లు ఇంటర్నెట్‌ సెర్చ్ చేస్తుంటారు.  కొంతమందయితే కనీసం 1 గంట నుంచి 3 గంటల వరకు ఇదే విషయంపై సెర్చ్ చేస్తుంటారు.  అయితే ఇది ‘సైబర్‌ కాండ్రియా’అనే మానసిక రుగ్మతను ఎదుర్కొనే వారి లక్షణాలని  నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఇటీవల చాలామందిలో  ఇది పెరిగిపోతోందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

నిజానికి కొన్నేళ్లుగా ఇంటర్నెట్లో ఎలాంటి  హెల్త్ ఇన్ఫర్మేషన్‌ కావాలన్నా అంతకు మించి సమాచారాన్ని అందిస్తుంది. దీంతో చాలామంది  నెట్‌లోనే  తమకు అనుమానాలను  తీర్చుకుంటున్నారు. ఇలా 90 శాతం మంది అమెరికన్లు.. వివిధ వెబ్‌సైట్‌లలో తమ ఆరోగ్య సమాచారం కోసం సెర్చ్ చేసినట్లు  నివేదికలు చెబుతున్నాయి. అలాగే 33 శాతం మంది తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం కోసం వెతుకుతున్నారని తేలింది. కరోనా తర్వాత ఈ  నెట్టింట్లో సెర్చింగ్ ట్రెండ్ మరింత పెరిగిపోయిందని..కానీ ఇదే  మెల్లమెల్లగా ఆందోళన, నిరాశకు కారణం అవుతోందని నిపుణులు చెబుతున్నారు.

కొంతమంది  ఇంటర్నెట్‌లో దొరికే కొంత తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల.. తమకు ఏదో అయిపోయిందని మరింత డిప్రెషన్‌కు లోనవుతున్నారు. మరికొందరు నెట్‌లో దొరికే సమాచారంతో లేనిపోని భయాలకు లోనవుతున్నారు.  తమకు ఏదో జరుగుతుందని  భయపడుతున్నారు. నిజానికి ఇలా ఇంటర్నెట్‌లో దొరికే సమాచారం అంతా కరెక్ట్ కాదన్న విషయాన్ని చాలామందికి తెలిసినా తేలికగా తీసుకోలేకపోతున్నారు. తలనొప్పికి రీజన్ ఏంటని వెతికినా అది కేన్సర్‌కు దారి తీస్తుందనే  సమాచారాన్ని ఇస్తుందన్న విషయం కూడా గుర్తు పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

సైబర్ కాండ్రియా లక్షణాలు కనిపించగానే ముందుగానే జాగ్రత్త పడాలి. హెల్త్ విషయంలో అనుమానం వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి తప్ప..పదే పదే ఇంటర్నెట్‌ను ఆశ్రయించకూడదని నిపుణులు అంటున్నారు. హెల్త్ పరమైన ప్రతి విషయంలోనూ ఆందోళన అవసరం లేదంటున్నారు. ఆందోళన, ఓవర్ థింకింగ్ ధోరణి  వంటి వాటినుంచి బయటపడితే సైబర్ కాండ్రియా రుగ్మత నుంచి బయట పడొచ్చని  సలహా ఇస్తున్నారు.  హెల్త్ విషయంలో ఎలాంటి అనుమానం ఉన్నా ముందుగా సంప్రదించాల్సింది డాక్టర్ నే కానీ..ఇంటర్నెట్‌ను కాదని గుర్తు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =