శక్తివంతమైన భారత్‌ను రూపొందిద్దాం: కిషన్ రెడ్డి

Kishan Reddy Took Charge As Union Minister, Union Minister Kishan Reddy, Kishan Reddy, PM Modi,BJP,Kishan Reddy Sworn Into Central Cabinet,Telangana,Etela Rajender,Election Commission Of India,2024 Elections In India,Lok Sabha Election Results,Political News, TS Live Updates,Mango News, Mango News Telugu
Union Minister Kishan Reddy, Kishan Reddy,BJP, PM Modi,

న్యూ ఢిల్లీలోని  శాస్త్రి భవన్‌లో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి. దీని కంటే ముందు తెలంగాణ భవన్‌లో  ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అలాగే కుటుంబ సమేతంగా వెళ్లిన కిషన్ రెడ్డి తెలంగాణ భవన్‌లో ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత  తెలంగాణ భవన్‌ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పూల మాల వేసి వందనాన్ని సమర్పించారు. అలాగే ..అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి కూడా ఆయన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్‎తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

దేశ ప్రజల ఆకాంక్షలతో, మోదీ సంకల్ప్​ పత్రంలో పేర్కొన్నట్టుగా ఈ ఐదేళ్లు పూర్తి స్థాయిలో తనకు అప్పగించిన శాఖల బాధ్యతలను నెరవేరుస్తాననని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. శక్తివంతమైన భారతదేశాన్ని రూపొందించడంలో బొగ్గు, మైనింగ్​ శాఖల పాత్ర కీలకమన్న ఆయన… దాన్ని నెరవేర్చడానికి కృషి చేస్తానని  చెప్పారు. సికింద్రాబాద్ నుంచి వరుసగా గెలుపొందుతున్న భారతీయ జనతా  పార్టీ కీలక నేత,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్.. కీలక శాఖలను కేటాయిస్తూనే  వస్తోంది.

ముందు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి గత ఎన్నికల్లో ఎంపీగా గెలవడంతో..అప్పుడు కేంద్ర సాంస్కృతిక శాఖను అప్పగించింది.అయితే  ఈసారి అత్యంత కీలకమైన కేంద్ర బొగ్గు, గనుల శాఖను కేటాయించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE