తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరింది బీఆర్ఎస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ ప్రయత్నాలన్నీ విఫలమే అయ్యాయి. వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థులను బరిలోకి దింపిన కేసీఆర్.. ఆయన కూడా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు పార్టీ బాధ్యతలన్నీ బుజాన ఎత్తుకొని చమటోడ్చారు. కానీ ఈసారి బీఆర్ఎస్ పాచికలు పారలేదు. అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. బీఆర్ఎస్ గద్దె దిగిపోయింది.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటుకోవాలని పాటు పడుతోంది. ఈ మేరకు లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టి.. మెజార్టీ స్థానాలను గెలుచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక పనిలో పడ్డారట. సీనియర్లు, ఎంపీ ఎన్నికల్లో మంచి పట్టు ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. అటు ఈసారి మహారాష్ట్రలో కూడా ఎంపిక చేసిన స్థానాల్లో పోటీ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట.
అయితే అసెంబ్లీలో గళం వినిపించేందుకు దమ్మున్న నేతలు ఉన్నప్పటికీ.. పార్లమెంట్‌లో గొంతు విప్పేందుకు బీఆర్ఎస్‌కు సత్తా ఉన్న నాయకులు లేరు. ఈక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పార్లమెంట్‌కు పంపించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. పార్లమెంట్‌లో బలంగా వాయిస్ వినిపించాలంటే అది కేటీఆర్‌తోనే సాధ్యమని.. ఆయన్ను ఎంపీగా పోటీలో ఉంచాలని అనుకుంటున్నారట. అయితే తెలంగాణ నుంచి కాకుండా.. మహారాష్ట్ర నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నారట. ఇక లోక్ సభ ఎన్నికల్లో కేటీఆర్ పోటీ చేయబోతుండడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ