పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి, సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay Writes Open Letter to CM KCR with Demand to Withdraw Hiked Electricity Charges, Bandi Sanjay Kumar Writes Open Letter to CM KCR with Demand to Withdraw Hiked Electricity Charges, Bandi Sanjay Writes Open Letter to CM KCR, Bandi Sanjay Demand to Withdraw Hiked Electricity Charges, Hiked Electricity Charges, BJP Telangana President And MP Bandi Sanjay Kumar, MP Bandi Sanjay Kumar, BJP Telangana President Bandi Sanjay Kumar, Telangana BJP President Bandi Sanjay Kumar, Bharatiya Janata Party Telangana President, Bandi Sanjay Kumar Bharatiya Janata Party Telangana President, Bandi Sanjay Kumar, Bandi Sanjay Kumar state president of the Bharatiya Janata Party in Telangana, Telangana Bharatiya Janata Party, Electricity Charges News, Electricity Charges Latest News, Electricity Charges Latest Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి లేదా రెఫరెండమ్ కు సిద్ధం కావాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ద్వారా తెలంగాణ ప్రజలపై రూ.6 వేల కోట్ల భారాన్ని మోపిందన్నారు. ఈ ప్రజా వ్యతిరేఖ చర్చను వెంటనే ఉపసంహరించుకుని ప్రజలకు ఉపశమనం కల్పించాలని లేదా పెంచిన విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం రిఫరండమ్ కు సిద్ధం కావాలని డిమాండ్ చేస్తున్నామని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం రిఫరెండమ్ కు సిద్ధపడి ముందుకు రాకపోతే బీజేపీ తెలంగాణ శాఖ విద్యుత్ చార్జీల పెంపుపై రిఫరెండమ్ నిర్వహిస్తుంది, దానికి మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఇప్పుడున్న సాంప్రదాయ పద్ధతులు మినహా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలవైపు ఆలోచించడం లేదని, నిరుద్యోగ యువతను బృందాలుగా ఏర్పాటు చేసి, శిక్షణ ఇప్పించి సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రుణాలు ఇస్తే యువతకు ఉపాధి, రాష్ట్రానికి చౌకగా కరెంటు దొరుకుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. రకరకాల పేరుతో పెంచిన 6 వేలకోట్ల విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలని, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే శాంతియుతంగా గాంధేయపద్ధతిలో ప్రజల తరుపున విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని బండి సంజయ్ సీఎంకు రాసిన బహిరంగ లేఖలో స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =