టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు అన్ని అడ్డంకులను తొలగించింది. రిజర్వేషన్ల అంశం క్లియర్ అయ్యేంత వరకూ మెయిన్స్ రిజల్ట్ వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన 7 పిటిషన్లను విచారించిన ధర్మాసనం అన్నింటినీ రద్దు చేసింది. ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేయడాన్ని హైకోర్ట్ తప్పుబట్టింది..
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చేపట్టిన పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. రిజర్వేషన్ల అంశం తేలేవరకు మెయిన్స్ పరీక్షల ఫలితాలు ప్రకటించొద్దని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్‌ను ఆదేశించాలన్న విజ్ఞప్తిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది.
2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే.. పిటిషన్లు ఇంత ఆలస్యంగా ఎందుకు దాఖలయ్యాయని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన జీవో 29 అప్‌లోడ్ కాలేదు అనే రీజన్ తోసిపుచ్చి ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి తర్వాత జీవోను సవాల్ చేయడం సరికాదని చీవాట్లు వేసింది. ఈ క్రమంలో రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన మరికొన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీనపై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ జి రాధారాణితో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు .
టీజీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం 2022లో జీవో 55 జారీ చేసింది. అయితే అప్పుడు పరీక్ష జరిగినా.. వరుస పేపర్ లీకేజీల వల్ల ప్రిలిమ్స్ పరీక్ష రెండుసార్లు రద్దైంది. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన రేవంత్ సర్కార్ పోస్టుల సంఖ్య పెంచుతూ 2024 ఫిబ్రవరిలో మరోసారి నోటిఫికేషన్ ఇస్తూ జీవో 29 జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం టీజీఎస్‌పీఎస్సీ అన్నింటా రిజర్వేషన్లు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. నల్లగొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన పోగుల రాంబాబుతో పాటు మరికొంతమంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మొత్తం అలా ఏడు పిటిషన్లు హైకోర్టులో దాఖలవగా.. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం రెండు పక్షాల వాదనలు విని అన్నింటిని రద్దు చేసింది.