తెలంగాణలో మద్యం విక్రయాల వేళలపై ఆంక్షలు ఎత్తివేత

liquor shops, Liquor Shops in Telangana, Liquor Shops Working Timings, Liquor Shops Working Timings Restrictions Lifted, Telangana Govt has Lifted Restrictions over Liquor Shops Working Timings, Telangana Liquor Shops, Unlock 3, unlock 3 in Telangana

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేసిన సంగతి తెల్సిందే. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతి ఇచ్చారు, అయితే దుకాణాలు పనివేళలపై మాత్రం ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇప్పటివరకు మద్యం దుకాణాలపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ, గతంలో లాగా సాధారణ వేళలు అమలయ్యేలా ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆబ్కారీ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు

ఇకనుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, అలాగే రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చు. లాక్‌డౌన్‌ తర్వాత ముందుగా రాత్రి 8 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వగా, ఆ తర్వాత రాత్రి 9:30 గంటల వరకు పొడిగించారు. తాజాగా ప్రభుత్వం అంక్షలన్నీ ఎత్తివేయడంతో మద్యం దుకాణాల వద్ద సాధారణ పనివేళలు అమలు కానున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here