దసరా పండుగ వస్తుందంటేనే తెలంగాణలో పెద్ద పండుగ వచ్చినట్లు. ఇక ఈ పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మందు, ముక్క ఉండాల్సిందే. అదే నిజం చేస్తూ.. ఈసారి దసరా పండుగ తెలంగాణలో ధూంధాంగా జరుగుతోందని మద్యం విక్రయ గణాంకాలు చెప్పకనే చెప్పేస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే దసరా ముందు వచ్చిన ఈ ఐదు రోజుల్లో 25 శాతం మద్యం అమ్మకాలు పెరిగినట్లు తేలింది.
గత ఏడాది దసరాతో కనుకు పోలిస్తే.. ఈ ఐదు రోజుల్లోనే 15 శాతం మేర అమ్మ కాలు పెరిగినట్లు తేలింది. అంటే ప్రతిరోజు తెలంగాణలో సగటున 124 కోట్ల రూపాయల మద్యం అమ్ముడవుతోందట. రికార్డు స్థాయిలో అక్టోబర్ 10వ తేదీన అయితే ఏకంగా 139 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్ షాపులకు తరలించారు. అదే రోజు 2.35 లక్షల కేసుల బీర్లు వైన్ షాపులకు చేరినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఈ ఏడాది కాలంలోనే ఈ స్థాయిలో బీర్ అమ్మకాలు జరగడం రికార్డు అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నా కూడా.. సాధారణ రోజుల్లో కూడా తెలంగాణలో సగటున రోజు 100 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. లక్ష కేసుల వరకు లిక్కర్ అమ్ముడవుతుంది. ఇప్పుడు దసరా సందర్భంగా ఈ అమ్మకాల జోరు మరింతగా పెరిగింది.
ఇక ఈ ఐదు రోజుల సగటు అమ్మకాలను చూస్తే రోజుకు 1.20 లక్షల లిక్కర్, 2 లక్షల బీర్లు ఉన్నాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి 8 రోజుల గణాంకాలను పరిశీలిస్తే మాత్రం 852.38 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడుపోయింది. దీనిలో 8.37లక్షల కేసుల లిక్కర్ ఉండగా, 14:53 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి.
అదే గత ఏడాది అక్టోబర్1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 800 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు లెక్కలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే పది రోజుల్లోనే 6.55 శాతం పుల్లుగా అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.