ర్యాపిడో అదిరిపోయే ఆఫర్.. ఆరోజు ఫ్రీ రైడ్స్

Rapidos amazing offer Free rides that day,Rapidos amazing offer,Free rides that day,Rapido Free rides,Mango News,Mango News Telugu,Rapidos amazing offer,free raides , telanagana elections,Rapido offers free rides,Free Rapido Bike Rides,Telangana Polls,Telangana Assembly Elections 2023,Telangana Assembly Polls,Telangana elections,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,Telangana Elections Live News
Rapido's amazing offer,free raides , telanagana elections

తెలంగాణలో ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. నేటితో ప్రచారానికి తెర పడనుండగా.. 30న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. అటు ఎన్నికల సంఘం ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చర్యలు తీసుకుంటోంది. ఓటుహక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తోంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఓటు వేసేందుకు బద్ధకిస్తుంటారు. ప్రభుత్వం ఆరోజు సెలవు ప్రకటించినప్పటికీ కూడా చాలా మంది ఆరోజును హాలీడేగానే ఫీల్ అవుతారు కానీ ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రారు.

ఎప్పుడు ఎన్నికలు జరిగినా హైదరాబాద్‌లోనే పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుంటుంది. ప్రతిసారి 40 నుంచి 50 శాతం ఓట్లు మాత్రమే పోలవుతుంటాయి. అయితే ఈసారి ఎలాగైనా.. హైదరాబాద్‌లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పోయిన సారి కంటే ఈసారి.. వీలైనన్ని ఎక్కువ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే.. ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్‌లో పోలింగ్ శాతం పెంచేందుకు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఉచితంగా బైక్ రైడ్ అనౌన్స్ చేసింది.

యువతను పోలింగ్ వైపు ఆకర్షించేందుకు ర్యాపిడో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని మొత్తం 2,600 పోలింగ్ కేంద్రాలకు ఫ్రీగా ఓటర్లను చేరవేస్తామని ర్యాపిడీ ప్రకటించింది. నగరంలో ఎక్కడి నుంచి అయినా.. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఓటర్లకు తమ సంస్థ సహాయం చేస్తుందని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుండుపల్లి వెల్లడించారు. ప్రయాణ ఖర్చుల కారణంగా కొంతమంది ఓటర్లు.. ఓటు హక్కును వినియోగించుకోకపోవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రతీఒక్క పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఇక ఈ ఆఫర్ పొందాలనుకున్న వాళ్లు ముందుగా ర్యాపిడో యాప్‌లోకి వెళ్లి రైడ్ బుక్ చేయాలి. ఆ తర్వాత ఓట్ నౌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం ఫ్రీ రైడ్ కన్ఫార్మ్ అయిపోతుంది. ఉచితంగా ర్యాపిడో బైక్‌పై పోలింగ్ బూత్ వరకు ప్రయాణించవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 16 =