రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్ ను మరో పది రోజుల పాటుగా కొనసాగించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన ప్రజలు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అనగా మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేయబడ్డాయి. ప్రయాణ సమయాలను రీషెడ్యూల్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 1, మంగళవారం నుంచి నగరంలోని టెర్మినల్ మెట్రో స్టేషన్స్ లో మొదటి రైలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే టెర్మినల్ మెట్రో స్టేషన్స్ లో చివరి మెట్రో రైలు మధ్యాహ్నం 1:00 గంటకు ప్రారంభమవుతుందని, ఆ మెట్రో రైళ్లు మధ్యాహ్నం 2:00 గంటలకు డెస్టినేషన్ కు చేరుకుంటాయని తెలిపారు.
ప్రతి ఒక్కరి భద్రతా దృష్ట్యా ప్రయాణికులంతా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం, థర్మల్ స్క్రీనింగ్ మరియు ఇతర అన్ని కోవిడ్ నిబంధనలను పాటించాలని ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి సూచించారు. అలాగే ప్రయాణికులంతా సెక్యూరిటీ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ