తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Manthani Congress MLA Duddilla Sridhar Babu Tests Positive for Covid-19

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే కి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు, నా భద్రతా సిబ్బందిలోని ఎస్. శ్రీనివాస్‌ కు కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. నేను బాగానే ఉన్నాను మరియు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాను, అలాగే ఎస్.శ్రీనివాస్ కూడా బాగానే ఉన్నాడు. ఇటీవల నాతో సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకుని, నిర్దేశించిన కరోనా ప్రోటోకాల్‌లను అనుసరించమని అభ్యర్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 4, బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,45,682 కి చేరింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ