ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటండి, అభిమానులకు మెగాస్టార్‌ చిరంజీవి పిలుపు

Chiranjeevi Birthday, Chiranjeevi Urges Fans to Plant 3 Sapling on His Birthday to support Green India Challenge, Chiranjeevi urges fans to take up the Green India challenge, Green India Challenge, Happy birthday Chiranjeevi, Happy Birthday Megastar Chiranjeevi, HBDMegastar, Mango News, Megastar Chiranjeevi Birthday, Megastar Chiranjeevi Urges Fans to Plant 3 Sapling on His Birthday to, Megastar Chiranjeevi Urges Fans to Plant 3 Sapling on His Birthday to support Green India Challenge

ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి జన్మదినం ఆగస్టు 22. తమ అభిమాన నటుడి జన్మదినం సందర్భంగా కొత్త సినిమాల అప్ డేట్స్ రావడంతో ట్వీట్లు, స్పెషల్ డిజైన్స్ పోస్టులతో సోషల్ మీడియాలో అభిమానులు సందడి ఇప్పటికే ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పలు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని ఒక్కొక్కరు మూడు మొక్కలు చొప్పున నాటాలని అభిమానులకు పిలుపునిచ్చారు.

“మనమందరం ప్రకృతి తల్లికి రుణపడి ఉంటాం. వాతావరణ మార్పు మరియు వాయు కాలుష్యంపై పోరాడటానికి మొక్కలు నాటడం మరియు చెట్లను పెంచడం చేద్దాం. ఈ సంవత్సరం నా పుట్టినరోజున ప్రియమైన అభిమానులంతా 3 మొక్కలు నాటాలని కోరుతున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచారానికి మద్దతుగా ట్విట్టర్ లో #HaraHaiTohBharaHai ని ట్యాగ్ చేయండి” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ పై ఎంపీ సంతోష్ స్పందించారు. “మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ పుట్టినరోజు నాడు ఇది చాలా మంచి ఆలోచన. ఇలా ఒక్కొక్కరు 3 మొక్కలు నాటాలని మీ అభిమానులను కోరడం దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలలో ప్రశంసలు అందుకుంటుంది. అలాగే ప్రకృతిని మరింత సుందరంగా మార్చడంలో సహాయపడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని ఎంపీ సంతోష్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ