ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ, కొత్తగా సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ నియామకం

Senior IPS Officer N Sanjay Replaces PV Sunil Kumar and Appointed as New AP CID Chief,Senior IPS Officer,N Sanjay Replaces,PV Sunil Kumar,Appointed as New AP CID Chief,Mango News,Mango News Telugu,New AP CID Chief,AP CID Chief,Ap Cid Chief Sunil Kumar,Ap Cid Chief Sunil Kumar Latest News And Updates,Ap Cid Chief Name,Cid Chief Meaning,Chief Secretary Of Ap List,Ap Cid Office Address,Chief Secretary Of Ap Mail Id,Ap Cid Contact Number,Chief Data Officer Vs Chief Analytics Officer

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీ సీఐడీ చీఫ్‌గా ఉన్న పీవీ సునీల్ కుమార్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్తగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్‌ను సీఐడీ అదనపు డీజీగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సునీల్ కుమార్‌ను సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా 1996 బ్యాచ్‌కు చెందిన సంజయ్ ప్రస్తుతం విపత్తు నిర్వహణ (ఫైర్ సర్వీసెస్) డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను సీఐడీ డీజీగా నియమించడంతో పాటు ఫైర్ సర్వీసెస్‌ను కూడా అదనంగా కేటాయించింది. ఇక ఇటీవలే సునీల్‌ కుమార్‌ డీజీగా పదోన్నతి పొందగా.. ఇంతలోనే ఆయనను ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. అయితే అంతర్గత బదిలీల్లో భాగంగానే ఇది జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here