మహిళలను ఆర్ధికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు టీడీపీ కృషి చేస్తోంది – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

TDP Chief Chandrababu Naidu Meets with DWCRA and Anganwadi Women at Kovvur East Godavari Today,DWCRA,Anganwadi Women,Kovvur East Godavari,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

మహిళలను ఆర్ధికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు టీడీపీ కృషి చేస్తోందని తెలిపారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన మూడో రోజు శుక్రవారం కొనసాగుతోంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరులో డ్వాక్రా, అంగన్‌వాడీ, పొదుపు సంఘాల మహిళలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మహిళలు ఆర్ధిక స్వావలంబన సాగించే దిశగా టీడీపీ కృషి చేస్తోందని, వారిని రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ‘దిశ’ పేరుతో కొత్తగా చట్టం తెచ్చామని చెబుతున్నారని, ఆయితే దానిని కేంద్రం గుర్తించలేదని వెల్లడించారు. టీడీపీ హయాంలో డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరిందని, డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.

సీఎం జగన్ తన పాదయాత్రలో అబద్దపు హామీలు ఇస్తే ఆయన నిజంగా రాష్ట్రాన్ని ఉద్దరిస్తారని అనుకుని ప్రజలు గంపగుత్తగా ఓట్లు వేశారని, అయితే మూడేళ్లు గడిచేసరికి తాము మోసపోయామని వారికి అర్థమైందని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు అన్యాయం జరుగుతోందని, డ్వాక్రా సంఘాల మహిళలను కేవలం సీఎం సభలకు తీసుకురావడానికి ఉపయోగిస్తున్నారని, రాకపోతే వారికి పెన్షన్లు, అమ్మఒడి కట్ వంటి సంక్షేమ పథకాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆడవారి ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు కట్టించి ఇస్తే, వాటిపై వైసీపీ పాలకులు ఇప్పుడు పన్నులు వేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలన వలన మహిళలకు లాభం కలిగిందా? లేదా? అనేది ఆలోచించాలని మహిళా సంఘాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =