కరోనాపై హాస్పిటల్ సూపరింటెండెంట్ లు, సిబ్బందితో మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్

Eatala Rajender, Medical Department Officials, Minister Eatala Rajender, Minister Eatala Rajender Video Conference, Minister Eatala Rajender Video Conference with Health Officials, Telangana Health Minister, Telangana Health Minister Eatala Rajender

తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న హాస్పిటల్ సూపరింటెండెంట్ లు, సిబ్బందితో జూలై 23, గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 104 వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ పని తీరుపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా రిసెర్చ్ చేస్తున్న వారితో చర్చలు జరుపుతున్నాం. ఎప్పటికప్పుడు అధునాతన ట్రీట్మెంట్ సమాచారం అందిస్తాము. వాక్సిన్ వచ్చినా దాని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అని మేధావులు చెప్తున్నారు. 99 శాతం మందిలో వెంటీలేటర్, రెమెడిసివర్ లాంటి మందులు అవసరం లేదు. యాంటీ ఇన్ఫ్లమాటొరి మందులు సకాలంలో ఉపయోగించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు. చాలామందికి కరోనా ఉన్న కూడా తెలియడంలేదు. భయంతోనే చాలా మంది చనిపోతున్నారు. ప్రజలకు ధైర్యం కలిపించడం మన ముందున్న లక్ష్యం. 24 గంటలు అందుబాటులో ఉంటాను, అందరం అదే స్పూర్తి తో పని చేద్దామని” చెప్పారు.

“ప్రతి సూపరింటెండెంట్ పూర్తి సామర్ధ్యంతో పనిచేయాలి. ప్రతి పేషంట్ ని హాస్పిటల్ కి రాగానే అడ్మిట్ చేసుకోవాలి. స్టెబిలైజ్ చేసిన తరువాతనే పెద్ద ఆసుపత్రులకు పంపించాలి. 95 శాతం మంది పేషంట్లకు ఎలాంటి సమస్య ఉండదు. మిగితా 5 శాతం మంది కోసమే కష్ట పడాలి. అవసరం అయిన సిబ్బందిని నియామకం చేసుకోండి. ఒక్క మనిషి విషయం లోకూడా నిర్లక్ష్యం వద్దు. త్వరగా కరోనా వైరస్ నిర్ధారణ చేద్దాం, మరణాలను అరికడదామని” మంత్రి ఈటల రాజేందర్ సూపరింటెండెంట్ లను కోరారు.

“హాస్పిటల్స్ కి ఉన్న అన్ని బకాయీలు చెల్లిస్తాం. డైట్ కాంట్రాక్టర్స్ బకాయిలు అన్నీ విడుదల చేస్తాం. కరోనా రోగులకు పౌష్టిక ఆహారం అందిచాలి. అన్ని జిల్లాల్లో ఐసొలేషన్ సెంటర్స్ ను మొదలు పెట్టాలి. శానిటేషన్, పేషంట్ కేర్ ప్రొవైడర్స్, లాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్ లో అవసరమైన సిబ్బందిని అనుమతి తీసుకొని నియమించుకోండి. అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలెండర్లు ఇక్కడి నుండే పంపిస్తామని” మంత్రి తెలిపారు.

హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. డాక్టర్ లకు ఎవరికన్నా వైరస్ సోకితే నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామని తెలిపారు. సీజనల్ వ్యాదులు ప్రబలుతున్నాయి కాబట్టి ఏజన్సీ ప్రాంతాల వారు వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu