టీఆర్ఎస్ పార్టీ జెండా పండగ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ఏప్రిల్ 27న కరోనా వల్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొలేక పోయామన్నారు. రేపటి నుండి గ్రామ, పట్టణ, జిల్లా కమిటీలు పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ జల దృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయిందని చెప్పారు. ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడుతూ, వారికి అధ్యక్ష పదవులు రావడం గులాబీ జెండా పుణ్యమేనని అన్నారు. వాళ్లు చేయాల్సింది పాదయాత్రలు కాదని, పెంచిన గ్యాస్, డీజిల్ ధరల పై ఢిల్లీ యాత్రలు చేయాలన్నారు.
ఇతర పార్టీలు అధికారమే ఎజెండాగా పనిచేస్తే, టీఆర్ఎస్ లక్ష్యం కోసం పనిచేస్తుంది:
ఇక రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని చెప్పారు. సాగునీరు, త్రాగునీరు, కరెంట్, రైతుబంధు, రైతు భీమా అనేక రంగాలలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, ఇతర పార్టీలు అధికారమే ఎజెండాగా పనిచేస్తే, టీఆర్ఎస్ లక్ష్యం కోసం పనిచేస్తుందని అన్నారు. “మేము బ్రతికి ఉండగా నీరు రావన్న ప్రతి పక్షాలకు మల్లన్న సాగర్ లో పారుతున్న గోదావరి తల్లే సజీవ సాక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మెస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కాపాడుకోవడానికి సహాయం చేస్తుంది. పెరగాల్సిన జిడిపి తగ్గుతుంటే ప్రజల నడ్డి విరిచే పెట్రో ధరలు పెరుగుతున్నాయి. కొన్ని పార్టీలు ఆంధ్ర నాయకుల చేతిలో , ఢిల్లీ నాయకుల చేతిలో పనిచేస్తే చేస్తాయి” అని హరీశ్ రావు అన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో, మండలాలు, మున్సిపాలిటీలు/కార్పొరేషన్స్ లో టీఆర్ఎస్ జెండా పండుగను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ