కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లాలో కొనసాగిన పాదయాత్రలో ఎడపల్లి నుంచి బోధన్ వరకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధన్‌లో సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని.. ఆయనకు ఒకటే చెబుతున్నామని, ఈ దేశంలో, రాష్ట్రంలో ప్రతీ ప్రాజెక్టు కాంగ్రెస్‌హయాంలో కట్టినవేనని తెలిపారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ఈ రోజు పదవులు అనుభవిస్తున్న మీరందరూ ఎలా ఉండేవారో ఆలోచించుకోవాలని సూచించారు. నాడు ఎంతోమంది యువకులు బలిదానాలు చేసుకుంటుంటే చూడలేక, అప్పుడు యూపీఏ చైర్ పర్సన్ స్థానంలో ఉన్న సోనియా గాంధీ దేశంలోని అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు.
ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందువల్లే మంత్రి కేటీఆర్ తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. అలాగే కేటీఆర్, ఆయన బావ హరీష్ రావు మంత్రులు అయ్యారని, ఆయన సోదరి కవిత ఎమ్మెల్సీ అయ్యారని వ్యాఖ్యానించారు. కాగా బుధవారం కామారెడ్డి జిల్లా పిట్లంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నన్ని రోజులూ ప్రజల గురించి ఆలోచించని కాంగ్రెస్ నాయకులు కుంభకోణాలు చేయడం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం వంటి పనులే చేశారని విమర్శించారు. అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయకుంటే.. కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్ర శాఖలు వచ్చేవా?, వాటికి బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు అధ్యక్షులు కాగలిగేవారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE