మంత్రి కేటీఆర్ కాలికి గాయం, మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన

Minister KTR Gets Injury on His Left Leg Doctors Suggest For Three Weeks Rest, Doctors Suggest For Three Weeks Rest, Minister KTR Gets Injury on His Left Leg, Minister KTR leg injured on His birthday, Telangana Minister KTR leg injured on birthday eve, Minister KTR Suffers Ankle Injury After A Fall, KTR was advised rest for three weeks by doctors, Minister KTR suffers ankle injury, Minister KTR Health, Minister KTR Health Condition, Minister KTR Health News, Minister KTR Health Reports, Minister KTR Latest Health Condition, Minister KTR Latest Health Report, Minister KTR Latest News, Minister KTR Latest Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు గాయమైంది. జారి పడటంతో ఆయన ఎడమకాలి మడమ చీలమండలంలో క్రాక్ ఏర్పడింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. “జారి పడటంతో ఎడమకాలి మడమకు గాయమైంది. డాక్టర్లు మూడు వారాల విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. ఈ స‌మ‌యంలో విలువైన‌ ఓటీటీ షోలు చూడ‌టానికి స‌ల‌హా ఇస్తారా?” అంటూ మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన మహీంద్రా యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఇది జరిగినట్లుగా తెలుస్తోంది. రేపు ఆయన జన్మదినం కాగా, ఈసారి వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే వరదల కారణంగా అనేక గ్రామాలు ముంపుకు గురైన పరిస్థితులలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తమకు తోచిన మేరకు వారికి సహాయం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ